బిల్వపత్రం ఆకులు మన ఆరోగ్యాన్ని రక్షించడంలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసా?

భారతీయ ఆయుర్వేద వైద్యంలో బిల్వపత్రం ఆకులకు, కాయలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వీటిని మారేడు మొక్కలు అని కూడా పిలుస్తారు. బిల్వపత్రం ఆకుల్లో ఉన్న ఔషధ గుణాలు మరియు పోషక విలువలు మన సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఎంతగానో తోడ్పడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.ఆధునిక వైద్యంలో కూడా మారేడు ఆకులు, కాయలను విరివిరిగా ఉపయోగిస్తున్నారు.

ముఖ్యంగా బిల్వపత్రం ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, సహజ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్, వైరల్ ,ఫంగల్ గుణాలు పుష్కలంగా లభిస్తున్నందువల్ల ఈ ఆకుల కషాయాన్ని సేవిస్తే మనలో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. బిల్వపత్రంలో ఉండే ఔషధ గుణాలు చక్కర వ్యాధిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి మరియు డయేరియా, అర్షమొలలు నివారించడంలో ఎంతగానో తోడ్పడుతాయి.

బిల్వపత్ర ఆకుల్లో మరియు కాయాల్లో పుష్కలంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ లభిస్తాయి కావున వీటి కషాయాన్ని సేవిస్తే అలసట నీరసం వంటి లక్షణాలు తొలగిపోయి శరీరానికి కావలసిన శక్తిని అందించడంలో సహాయపడతాయి. రక్తపోటు సమస్యను నియంత్రించడంలో బిల్వపత్రం ఆకులు ఎంతగానో తోడ్పడుతాయి. మారేడు ఆకుల్లో ధమనుల ఆరోగ్యాన్ని పెంపొందించే ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి కావున గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బిల్వపత్రం ఆకుల్లో ఎక్కువగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి సహజ పోషకాలు లభిస్తాయి ఇవి ఎముకలు దంతాల ఆరోగ్యాన్ని కాపాడి ఆర్థరైటిస్, ఆస్తియోఫోరోసిస్ ముప్పును తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తికి తోడ్పడి రక్తహీనత సమస్యను నివారిస్తుంది. బిల్వపత్రం ఆకుల్లో ఉండే సహజ యాంటీ ఆక్సిడెంట్స్, పీచు పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది మరియు ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.