వామ్మో… కమ్మటి వాసన కోసం గుండెనే ఇబ్బందుల్లో పెడుతున్నంగా.. అది తింటే అంతే!

ప్రస్తుత కాలంలో చాలామంది నూనెతో చేసిన వంటకాలు లేదా నెయ్యితో చేసినవి గాని తినటానికి భయపడతారు ఎందుకంటే ఎక్కువ నూనె పదార్థాలను తినటం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే గుండె సంబంధిత వ్యాధులు, శరీర బరువు పెరుగుతుందని అపోహ పడుతుంటారు.
నిజానికి నెయ్యి తినడం వల్ల కలిగే నష్టాల కంటే లాభాలే ఎక్కువ. పూర్వకాలంలో మన పెద్దలు అన్ని వంటలను నెయ్యి వేసి వండేవారు. నెయ్యి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు నెయ్యిని తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.

నెయ్యిలో ఎన్నో విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. నెయ్యి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ఒరిజినల్ నెయ్యి తినటం వల్ల అధిక బరువు నియంత్రించవచ్చు. నెయ్యిలోని విటమిన్ -ఏ, విటమిన్- డి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.నెయ్యి తినడం వల్ల అధిక బరువు తగ్గించడమే కాకుండా మతిమరుపును కూడా తగ్గించవచ్చు.

నెయ్యి తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. నెయ్యి కంటిచూపును కూడా మెరుగుపర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలా నెయ్యి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కేవలం అధిక శరీర బరువు కొలెస్ట్రాల్ తో బాధపడేవారు మాత్రం నెయ్యి తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుందని అలాంటి వారు నెయ్యికి దూరంగా ఉండటం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.