ఇండియా వాంట్స్ టు నో అనే అర్నబ్ గోస్వామిని… అరెస్టు చేసిన పోలీసులు

రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సహకరించకపోవడంతో ఇరువర్గలా మధ్య హర్షణ ఏర్పడింది. దీంతో కొంత సేపు హైడ్రామా నడిచింది. ఈ దృశ్యాలను రిపబ్లికన్ టీవీ పదే పదే ప్రసారం చేసి హడావిడి చేసింది. ముంబై పోలీసులు తనతో పాటు పాటు తన కుటుంబపట్ల అనుచితంగా ప్రవర్తించారని గోస్వామి ఆరోపించారు. ఓ నేరస్తుడి పట్ల వ్యవహరించాల్సిన విధంగా తనతో వ్యవహరించారని అన్నారు.

అయితే అరెస్టు సమయంలో అర్నబ్‌ను పోలీసులు జుట్టు పట్టుకుని లాగారని.. భౌతిక దాడి చేశారని రిపబ్లికన్ టీవీ ఆరోపించింది. సుమారు 20 మంది సాయుధ పోలీసులు అర్నబ్‌ను చుట్టుముట్టి బలవంతంగా పోలీస్ వ్యాన్ ఎక్కించారని రిపబ్లికన్ టీవీ ఆరోపించింది.  పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సమయంలో పలు వహనాలు మార్చారని ఆరోపించింది.

టీవీ టీఆర్పీ స్కామ్‌ లో ఇటీవలే అర్నబ్ గోస్వామిపై ఇరుక్కున్న విషయం తెలిసిందే. సోనియ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల మీద గతంలో కూడా ఓ కేసు నమోదు  అయింది. ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌కు లాక్ డౌన్ సమయంలో పెద్ద ఎత్తున కూలీలు చేరుకున్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించారన్న ఆరోపణల మీద  మరో కేసు నమోదు అయింది. అయితే 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్యకు పాల్పడేలా ఉసిగొల్పారన్న కేసులో ఆయన్ని అరెస్టు చేసినట్లు సమాచారం. 2018లో అన్వయ్ నాయక్ అనే ఆర్కిటెక్ట్​ తన తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించని కారణంగా అత్మహత్య చేసుకుంటున్నట్లు సుసైడ్ నోట్ లో పేర్కొంది. ఈ కేసులోనే అరెస్టు చేసినట్లు పోలీసులు కూడా వెల్లడించారు.