Periods: మహిళలలో పీరియడ్స్ అనేవి ప్రతి నెలా జరిగే ప్రక్రియ. ప్రతి నెల మహిళలలో ఇది సర్వసాధారణంగా శరీరంలో జరిగే ఒక ప్రక్రియ. అయితే దీనిని కొన్నిసార్లు.. ఏమైనా పూజలు, ఫంక్షన్ ఉంటే చాలామంది దీనిని పోస్ట్పొన్ చేయడానికి టాబ్లెట్స్ వాడుతుంటారు. అదే సులువైన మార్గంగా మహిళలు పరిగణిస్తారు. మహిళలకు సహజంగా వచ్చే పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి ఉపయోగించే మందులు అన్ని మెడికల్ స్టోర్ లలో పరిమితి లేకుండా లభిస్తాయి. దీనికి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు.
పీరియడ్స్ ని ఆపడానికి మందులు వినియోగించడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. గైనకాలజిస్టు లు ఈ మందులు తప్పనిసరి అయితే ఎలా ఉపయోగించాలో, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇలా వివరించారు. డాక్టర్లు ఈ మందులను వాడమని సూచనలు ఇవ్వనప్పటికీ మహిళలు వారి కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి పీరియడ్స్ పోస్ట్పొన్ చేయడానికి చూస్తుంటారు. శరీరానికి దినచర్య, దాని సొంత వ్యవస్థా ఉంటాయి. దానిని మార్చడానికి ట్రై చేస్తే అనారోగ్య సమస్యలు రావడం తథ్యం.
మహిళల పీరియడ్స్ అనేవి శరీరంలో ఉన్న ఈస్ట్రోజన్, ప్రోజెస్టరన్ మీద ఆధారపడి ఉంటాయి. పీరియడ్స్ రావడానికి టాబ్లెట్స్ వాడటం వల్ల శరీరంలో ప్రోజెస్టరన్ స్థాయిని పెంచుతాయి. హార్మోన్ల ప్రభావం వల్ల పీరియడ్స్ ఆగుతాయని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చిన్న లేదా పెద్ద కారణాల వల్ల మీరు టాబ్లెట్స్ వాడటం వల్ల చాలా ఆరోగ్య సమస్యల బారిన పడతారు. ఈ మందులు ఉపయోగం వల్ల కాలేయ సమస్యలు, సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం, పీరియడ్స్ రాకున్నా రక్తస్రావం జరగడం, గర్భాశయం లో సమస్యలు, నీరసం, అలసట, వాంతులు వంటివి శరీరంలో వస్తాయి.
ఇంకా చాలామంది గర్భం దాల్చకుండా ఇవి ఉపయోగపడతాయని అపోహపడుతుంటారు. పీరియడ్స్ ఆపే మందులు పీరియడ్స్ ని మాత్రమే ఆపగలవు. ఇవి గర్భం దాల్చకుందౌందటనికి ఎటువంటి ప్రభావం చూపవు. పీరియడ్స్ ని ఆపడానికి అత్యవసర పరిస్థితులలో తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మందులు వాడటం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరే చేచేతల నాశనం చేసుకున్న వారవుతారు.