Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా? దోసకాయ నీరు ట్రై చేయండి..!

Weight Loss Tips:ఈ ఆధునిక యుగంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, చిరు తిండ్లు, ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల శరీర బరువు విపరీతంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా శరీరాకృతులు బారిగా తయారవుతున్నాయి. బరువు తగ్గడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. వ్యాయామాలు, వాకింగ్ లు, డైట్ లు అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు, అయినా సరే బరువు తగ్గడం లేదు. ఇలాంటి వారికి సులభమైన మార్గం కీర దోసకాయ నీరు తాగడం. కీరా దోసకాయలో సహజంగానే ఆరోగ్యానికి మేలు చేసే అనేక ఔషధాలు ఉన్నాయి. మీరు ఆరోగ్యంగా ఇంకా ఫిట్ గా ఉండాలి అనుకుంటే రోజు పరగడుపునే దోసకాయ నీళ్లు తాగడం లేదా జ్యూస్ తాగడం మంచిది. కీరదోస నీరు తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

దోసకాయలో విటమిన్ ఎ, సి, కె, ఐరన్, పొటాషియం, క్యాల్షియం లభిస్తాయి. పందిరి దోస కాయలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ నీరు తయారు చేసుకోవడం చాలా సులభం. రాత్రి పడుకునే ముందు దోసకాయ చిన్న ముక్కలుగా చేసి, ఒక గ్లాసు లో ఆ ముక్కలను వేసి నీరు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం లేవగానే పరగడుపున నీటిని తాగడం వల్ల బరువును తగ్గించుకోవచ్చు. పందిరి దోస లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగానే ఎక్కువ తినలేము. కొంచెం తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. వీటిని కనుక తింటే మీ శరీర బరువును తగ్గించుకోవచ్చు. దోసకాయ నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

1. శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందిస్తుంది. మీ రోగనిరోధకశక్తిని పెంపొందించడానికి, మీ శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడే విటమిన్ ఏ, బి, సి లు దోసకాయలో పుష్కలంగా ఉన్నాయి.
2. మీకు హైబీపీ లేదా లోబీపీ సమస్యలు ఉన్నట్లయితే రోజు దోసకాయ నీరు తాగడం వల్ల వీటిని అదుపులో ఉంచుకోవచ్చు. శరీరాన్ని సాధ్యమైనంతవరకు డి హైడ్రేట్ కాకుండా చూసుకోవడం వల్ల హై బీపీ సమస్యను తగ్గించుకోవచ్చు.
3. వేసవిలో శరీరం ఎక్కువగా వేడి కి గురవుతుంది. దోసకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు.
4. దోసకాయ నీటిలో మినరల్స్, ప్రోటీన్స్, న్యూట్రియెంట్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల కొన్ని రకాల ప్రాణాంతకమైన వ్యాధుల ను దరిచేరకుండా నిరోధిస్థాయి. క్యాన్సర్ కూడా రాకుండా నిరోధిస్తుంది.
5. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు కూడా ఈ జ్యూస్ రోజు తాగడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.
6. దోసలో 90% నీటిశాతం ఉంటుంది. శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉంచుకోవటానికి కూడా ఈ జ్యూస్ ఉపయోగపడుతుంది.
7. ఈ నీటిని తాగడం వల్ల రక్తప్రసరణ మీద ప్రభావం చూపి ఏవైనా గాయాలు అయిన సరే త్వరగా మానటం లో సహాయపడుతుంది.

ఈ దోసకాయ నీటిని రోజు క్రమం తప్పకుండా తాగటం వల్ల మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దోసకాయను జ్యూస్ గా కానీ, పచ్చిగా తిండటం కానీ ఏదైనా మీ డైట్ లో రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.