ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎక్కువగా వేధించే సమస్యలలో పంటి నొప్పి సమస్య కూడా ఒకటి. ఈ సమస్య నుండి బయటపడటానికి వేల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రిలో చుట్టూ తిరుగుతుంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా ప్రకృతిలో లభించే జామ చెట్టు ఆకులను ఉపయోగించటం వల్ల పంటి నొప్పి సమస్య నుండి వేగంగా ఉపశమనం పొందవచ్చు. పంటి నొప్పిని నివారించటంలో జామ ఆకులు ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పంటి నొప్పితో బాధపడేవారు గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి శుభ్రం చేసిన మూడు జామ ఆకులను ఆ నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడపోసి కొంచెం చల్లారిన తర్వాత ఆ నీటినీ నోట్లో పోసుకొని పుక్కలించాలి. ప్రతిరోజు నాలుగైదు సార్లు ఇలా పుక్కిలించటం వల్ల పళ్ళ మధ్యలో ఉన్న బ్యాక్టీరియా తొలగిపోయి పంటి నొప్పి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. జామ ఆకులలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నోటిలో ఉన్న బాక్టీరియా తొలగించడంలో ఎంతో ఉపయోగపడతాయి.
చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన నివారించటంలో కూడా జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. లేదా జామ ఆకుని బాగా శుభ్రంగా కడిగి కొంచెం ఉప్పు వేసుకుని నమిలి తినటం వల్ల పంటి నొప్పి సమస్యతో పాటు చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన సమస్యలు కూడా నియంత్రించవచ్చు. అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారికి కూడా జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి. షుగర్ వ్యాధితో బాధపడేవారు ప్రతిరోజు ఒకటి లేదా రెండు జామ ఆకులను నమిలి తినటం వల్ల రక్తంలో షుగర్ శాతం తగ్గుతుంది. లేదా జామ ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని తాగటం వల్ల కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.