Fungal Nail Infection : గోటిపై ఫంగస్ ఏర్పడి నొప్పితో సతమతమవుతున్నారా… ఈ సింపుల్ చిట్కాతో నొప్పికి చెక్ పెట్టండి!

Fungal Nail Infection : ప్రస్తుత కాలంలో చాలా మందికి చేతి లేదా కాలి గోర్ల పై ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఇది గోర్లు అంచు వద్ద మొదలై నెమ్మదిగా గోరు మధ్య వరకు వ్యాపిస్తుంది. దీనివల్ల గోరు రంగు మారడం లేదా రంగు పోవడానికి దారి తీస్తుంది. అయితే గోరు యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ తీవ్రమైనది కాకపోయినప్పటికీ ఇది తగ్గిపోవడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సలహా తీసుకోవాలి.

గోరు ఇన్ఫెక్షన్ అయినప్పుడు గోర్ల చుట్టు నొప్పి, వాపు, గోరు గట్టిపడటం, గోరు ఆకారంలో మార్పు, గోరు రంగు పోవడం లేదా రంగులో మార్పు, గోర్లు పెలుబారడం, గోరు క్రింద వ్యర్థాలు చిక్కుకోవడం, గోర్లు అంచులు చిన్న చిన్న ముక్కలు అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ ప్రారంభదశలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా బాగా ఉపయోగపడుతుంది.

ఈ సమస్య వచ్చినపుడు అస్సలు అశ్రద్ద చేయకండి. డాక్టర్ ని సంప్రదించి, డాక్టర్ చెప్పే సూచనలు పాటిస్తూ ఈ చిట్కాను పాటిస్తే త్వరగా నయమవుతుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతి పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్, 3 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న ప్రదేశంలో ఉదయం ,సాయంకాలం ఈ పేస్ట్ పూయలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రాంతాన్ని శుభ్రపరచాలి. ఈ విధానాన్ని ఆ సమస్య తగ్గే వరకు అవలంబించాలి.ఇలా చేయడం వల్ల గోరుకు వచ్చే ఫంగస్, పుచ్చు వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీని కోసం కాస్త సమయం, శ్రద్ద అవసరం అవుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు వాపు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి.