షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా… ఈ కూరగాయలు తింటే ప్రమాదంలో పడ్డట్టే…?

ప్రస్తుత కాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా చాలామంది షుగర్ వ్యాధి వారిన పడుతున్నారు. అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు వారు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేదంటే వారి సమస్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడేవారు కొన్ని రకాల కూరగాయలను తినకపోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారు ఏ ఏ కూరగాయలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

షుగర్ వ్యాధితో బాధపడేవారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలి. బంగాళాదుంపలు తినటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. బంగాళ దుంపలలో పిండి పదార్థాలు అధికంగా ఉండటం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా బంగాళ దుంపలలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. బంగాళదుంపలు తినడం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులను రక్తంలో షుగర్ శాతం పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు బంగాళా దుంపలను తినకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక బటానీలలో కూడా పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. అందువల్ల షుగర్ వ్యాధితో బాధపడేవారు వారు తీసుకొనే ఆహారంలో బఠానీలు లేకుండా చూసుకోవాలి. బటానీలు తినటం వల్ల అందులో ఉండే పిండి పదార్థాలు రక్తంలో షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే షుగర్ వ్యాధితో బాధపడేవారు మొక్కజొన్నలను కూడా తినకూడదు. మొక్కజొన్నలలో గ్లైసెమిక్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఒకవేళ మొక్కజొన్నలను తినాలనుకునేవారు ఫైబర్ శాతం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలతో పాటు కలిపి మొక్కజొన్నలను తినవచ్చు.