Beauty Tips: ఈరోజు ఇలా అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు.వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం పెరగటం వల్ల అనేక చర్మ సంబంధిత వ్యాధులు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. వాతావరణ కాలుష్యం దుమ్ము, ధూళి కారణంగా తరచూ ముఖం మీద మొటిమలు సమస్య వేధిస్తుంది. మొటిమల నుండి విముక్తి పొందటానికి చాలామంది వేరే రూపాయలు ఖర్చుపెట్టి డాక్టర్ సలహాలు తీసుకుంటారు. కానీ మన ఇంట్లో లభించే టమోటా వల్ల మొటిమల సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు.
టమాటాలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా మొటిమల సమస్య నివారించటంలో టమోటాలు ఎంతో ఉపయోగపడతాయి.టమోటా ని ఉపయోగించి కొన్ని రకాల ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు సమస్య తగ్గి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
• ముందుగా టమాటాలను ముక్కలుగా కోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల పాలలో ఉండే విటమిన్ సి ముఖం మీద ఏర్పడిన నల్ల మచ్చలు తగ్గిస్తుంది. తేనె చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.
• ముల్తానీ మట్టిలో కొంచెం టమోటా రసం కలిపి ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాలు తొలగిపోయి మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా ఎండవల్ల ఏర్పడిన ట్యాన్ కూడా తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
• టమోటా రెండు ముక్కలుగా కోసి ముఖం మీద రుద్దటం వల్ల కూడా మొటిమల సమస్య తగ్గుముఖం పడుతుంది.ఇలా చేయటం వల్ల అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొటిమల సమస్యను నివారించవచ్చు.