Health Tips: సాధారణంగా చాలా మంది శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో చిట్కాలు పద్ధతులు పాటిస్తుంటారు. చాలామంది డైట్ ఫాలో కావడమే కాకుండా తగిన వ్యాయామాలు చేస్తూ శరీర బరువు తగ్గడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరి కొందరు రాత్రిపూట ఆహారం తీసుకోవడం కూడా పూర్తిగా మానేస్తుంటారు.అయితే ఈ విధంగా రాత్రిపూట ఆహారం తీసుకోవడం మానేస్తున్న వారికి షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. రాత్రిపూట ఆహారం తినకుండా ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం…
మన ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేస్తాము అయితే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేయకుండా ఉంటారు. మధ్యాహ్న భోజనం చేయడం.. రాత్రిళ్లు భోజనానికి చాలా గ్యాప్ ఉంటుంది. దీంతో ఒక్కపూట భోజనం మానివేసినా.. బలహీనంగా మారిపోతారు. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల త్వరగా అలసిపోయి నీరసం రావడం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఎక్కువ సమయం పాటు ఏమి తినకపోవడం వల్ల కడుపులో గ్యాస్ వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. దీంతో కడుపులో మంట రావడమే కాకుండా సరిగా నిద్ర కూడా పట్టదు. అందుకే రాత్రిపూట భోజనం కాకుండా ఏదైనా తేలికపాటి ఆహారం తీసుకోవడం ఎంతో మంచిది. ఇలా రాత్రిపూట భోజనం చేయకుండా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే కాకుండా రక్తహీనత, బలహీనంగా తయారవ్వడమే కాకుండా తల తిరగడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే రాత్రిపూట భోజనం కాకుండా అల్పాహారం తినడం ఎంతో మంచిది.