Operation: సాధారణంగా చాలామంది ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విపరీతంగా బరువు పెరుగుతూ ఉంటారు. అయితే కొందరు ఎప్పటిలాగే బరువు ఉన్నప్పటికీ ఇంకొందరు మాత్రం బరువు పెరుగుతూ ఉంటారు. అయితే ఇలా బరువు పెరగడానికి చాలా మంది చాలా విధాలుగా కారణాలు అనుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యంగా శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరుగుతారని అనుకుంటూ ఉంటారు. అయితే బరువు పెరగడం లో ఇది కూడా ఒక కారణం అయినప్పటికీ, ఇవే కాకుండా బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆపరేషన్ తర్వాత శరీరానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. దీనితో వివిధ కార్యకలాపాలు తగ్గడంవల్ల బాగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా ఆపరేషన్ తర్వాత డాక్టర్లు కోలుకోవడానికి కొన్ని మందులను వాడమని సూచిస్తూ ఉంటారు. ఆ మందులు వాడడం వల్ల బలం, శక్తి తిరిగి వస్తాయి. అవి జీవక్రియ వ్యవస్థను ప్రభావితం చేయడం తో పాటు బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. అదే విధంగా ఆపరేషన్ వల్ల శరీర సమతుల్యత దెబ్బ తినడమే కాకుండా దాని కారణంగా హార్మోన్లలో అసమతుల్యత పెరుగుతుంది. దీనితో శరీరంపై ఒత్తిడి మొదలవుతుంది. ఇప్పుడు బరువు పెరుగుతారు.
అలాగే దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా అడ్రినల్ గ్రంధి పై ఎక్కువ ప్రభావం పడటం వల్ల అది ఎక్కువ కార్టిసాల్ హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో కార్టిసాల్, యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ అడగడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారు. అయితే శరీరానికి శక్తిని అందించడంలో ప్రోటీన్ ప్రత్యేక పాత్ర వహిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి ఎక్కువగా గుడ్లు,చేపలు, పప్పులు మొదలైన వాటిని తీసుకుంటూ ఉండాలి. అలాగే కూరగాయలు, నీరు ఎక్కువగా ఉన్న పండ్లు, అధిక మోతాదులో ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా సహాయపడతాయి. అయితే ఈ సలహాలు పాటించడానికంటే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.