పాదాలు పగిలి అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఈ చిట్కాలతో మీ సమస్య మాయం..!

Health Tips: ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. జుట్టు, చర్మ సౌందర్యం తో పాటు పాదాలు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా పాదాల పగుళ్లు సమస్య వేధిస్తుంది. పాదాలు పగిలి చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి.అయితే ఈ పాదాల పగుళ్లు నివారణకు చాలామంది మార్కెట్లో లభించే కొన్ని రకాల క్రీములను ఉపయోగిస్తూ ఉంటారు. వంటింటి చిట్కాల ద్వారా పాదాల పగుళ్లు సమస్య నివారించవచ్చు.

పాదాలు పగుళ్లు సమస్య మొదలైనప్పుడు సమస్య తీవ్రత పెరుగుతుంది జాగ్రత్త పడాలి. లేకపోతే అందులో దుమ్ము, ధూళి చేరి సమస్య తీవ్రత పెరుగుతుంది. పాదాలు పగిలినప్పుడు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి పాదాలను పది నిమిషాల పాటు నానబెట్టి శుభ్రం చేసుకోవాలి. తర్వాత మన ఇంట్లో ఉండే ఏదైనా వంట నూనె లేదా వెన్న, కొబ్బరి నూనె వంటివి పాదాలకు పట్టించి బాగా మర్దన చేయాలి. కొన్ని రోజులపాటు ఇలా చేయటం వల్ల పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి.

పాదాల పగుళ్లు సమస్య నివారణకు వేపాకు ఎంతో ఉపయోగపడుతుంది. వేపాకు వేపాకులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాల వల్ల కాళ్ళ పగుళ్ళు సమస్య తొందరగా తగ్గుతుంది. ముందుగా కొన్ని వేపాకులను మెత్తగా రుబ్బి అందులో కొంచెం పసుపు, కొంచెం ఆముదం నూనె కలపాలి.గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాత ఒక టవల్ తో పాదాలని తేమ లేకుండా తుడిచి వేపాకు పేస్ట్ ను పాదాలకు పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ప్రతి రోజు ఇలా చేయటం వల్ల పాదాల పగుళ్లు సమస్య తగ్గి పాదాలు మృదువుగా మారతాయి. వేపాకులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దుమ్ము, ధూళి కారణంగా ఎటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా కాపాడతాయి. ఆముదం పాదాలకు మాయిశ్చరైజర్ గా పనిచేసి పాదాలు మృదువుగా తయారవుతాయి. కొంతమందిలో శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల ఈ పాదాల పగుళ్లు సమస్య మొదలవుతుంది. అటువంటివారు గోరింటాకును మెత్తగా రుబ్బి పాదాలకు రాయటం వల్ల వారి సమస్య తగ్గుతుంది.