Health Tips: ప్రస్తుత కాలంలో తరచూ వేధిస్తున్న సమస్యలలో నోటి దుర్వాసన సమస్య కూడా ఒకటి. నోటిలో ఉండే తిరుమల కారణంగా ఈ నోటి దుర్వాసన సమస్య మొదలవుతుంది. ఈ సమస్యతో బాధపడే వారు ఎదుటి వారితో మాట్లాడటానికి, వారి పక్కన కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చిట్కాలను ఉపయోగించి ఈ నోటీ దుర్వాసన సమస్య నిర్మూలించవచ్చు. ఇప్పుడు మనం ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
నోటి దుర్వాసనతో బాధపడేవారు గోరువెచ్చటి నీటిలో కొంచెం ఉప్పు కలుపుకొని ఆ నీటిని పుక్కిలించాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. మెంతి నీరు కూడా నోటి దుర్వాసన సమస్య తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.వేడి నీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు రాత్రిపూట నానబెట్టి ఉదయం లేవగానే ప్రతి రోజు నీటిని తాగడం వల్ల క్రమంగా నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.
మన ఇంట్లో పోపుల డబ్బాలో ఉండే లవంగాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి ఔషధ గుణాలు కలిగిన ఈ లవంగాలను ఆయుర్వేదం లో విరివిగా ఉపయోగిస్తున్నారు.ప్రతిరోజూ ఒకటి లేదా రెండు లవంగాలను నోట్లో వేసుకొని నమలడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గడమే కాకుండా పంటి నొప్పి సమస్య కూడా తగ్గుతుంది.
నిమ్మరసంలో విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల నోటిలో ఉన్న బ్యాక్టీరియా ని నాశనం చేస్తుంది. ఒక చిన్న గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ప్రతిరోజు తాగాలి. ఇలా చేయటం వల్ల శరీరానిక కావలసిన విటమిన్ సి లభించడమే కాకుండా నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది.
నోటి దుర్వాసన తగ్గించడంలో కొత్తిమీర కూడా బాగా ఉపయోగపడుతుంది. కొత్తిమీరలో క్లోరోఫిల్ అనే పదార్థం యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా నోటి వాసనను నివారింస్తుంది. తాజా కొత్తిమీరను తీసుకుని నోట్లో వేసి నలమడం లేదా కొత్తి మీర రసం తాగడం వల్ల ఆ సమస్య దూరమవుతుంది.