ఆరోగ్యానికి మంచిదని నేరేడు పండ్లు అతిగా తింటున్నారా…? జాగ్రత్త సుమీ!

పండ్లు ఆరోగ్యానికి కావాల్సిన అనేక రకాల పోషకాలను అందించి ఎన్నో రకాల వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి. అందువల్ల ప్రతిరోజు ఏదో రకమైన పండ్లు తినమని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. కొన్ని రకాల పండ్లు కొన్ని సీజన్లో మాత్రమే లభిస్తాయి. ఇలా వేసవికాలంలో మాత్రమే లభించే పనులలో నేరేడు పండ్లు కూడా ఒకటి. నేరేడు పండ్లు చూడటానికి చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని ఈ నేరేడు పండ్లను ఎక్కువగా తినటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నేరేడు పళ్ళు అతిగా తినటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తీపి, పులుపు రుచితో ఉండే ఈ నేరేడు పండ్లు తినటం వల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా అసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు తగ్గుతాయీ. అయితే ఈ నేరేడు పండ్లు ఎక్కువగా తినటం వల్ల మలబద్దకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిని తగిన పరిమాణంలో తినటం ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడే వారు కూడా ఈ నేరేడు పండ్లను ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా మొటిమల సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లను ఎక్కువగా తినటం వల్ల వారి సమస్య అధికమవ్వటమే కాకుండా ఇతర చర్మ సంబంధిత సమస్యలు కూడా మొదలయ్యే ప్రమాదం ఉంటుంది.

ప్రస్తుత కాలంలో బిపి సమస్య అందరిని ఎక్కువగా వేధిస్తోంది. ఈ బీపీ సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లు తినడం వల్ల బిపి సమస్య నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ పండ్లు అతిగా తినటం వల్ల లోబిపి సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలా లో బిపి ప్రాణానికి చాలా ప్రమాదకరం. అందువల్ల బీపీ సమస్యతో బాధపడేవారు నేరేడు పండ్లు మోతాదుకు మించి తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. నేరేడు పండ్లు మాత్రమే కాకుండ ఏ ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు కూడా ఆరోగ్యానికి మంచిదని, అయితే ఎక్కువగా తీసుకోకూడదు. దేనినైనా తగిన మోతాదులో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.