మంకీ పాక్స్ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన శైలి, ఆహారపు అలావాట్ల కారణంగా కొత్త రకాల వ్యాధులు తలెత్తుతున్నాయి. దేశంలో కరోనా విజృంభించి అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా దేశంలో ఆర్థిక సమస్యలు తలెత్తటమే కాకుండా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గి కొంత ఊరట లభించింది. కరోనా తగ్గిందని ప్రజలు ఆనందపడే లోపే మంకీ పాక్స్ అనే కొత్త వ్యాది అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంది. ప్రస్తుతం దేశంలో మంకీ ఫాక్స్ వ్యాధి కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మంకీ ఫాక్స్ వ్యాధి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు మశూచి వ్యాధికి దగ్గరగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీ పాక్స్ వ్యాధి సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, చలి, నీరసం, శ్వాస సంబంధిత సమస్యలు, ఒంటిపై దుద్దుర్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించి పలు పరీక్షలు చేయించుకొని సరైన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మంకీ ఫాక్స్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండటానికి సరైన జాగ్రత్తలు కూడా పాటించాలి. మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన వ్యక్తికి దూరంగా ఉండటం చాలా అవసరం.

US సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, మంకీపాక్స్ సోకిన వారిని తాకినా లేదా వారికి దగ్గరగా ఉన్న కూడా ఈ వ్యాది మరొకరికి సోకే ప్రమాదం ఉంటుంది. మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన వారి చర్మం తాకినా కూడా ఈ వ్యాధి మనకు వ్యాపిస్తుంది. అందువల్ల మంకీ ఫాక్స్ వ్యాధి సోకిన వారిని ముట్టుకోవటం వారికి దగ్గరగా ఉండటం చేయకూడదు. మంకీ ఫాక్స్ వ్యాధి నుండి బయటపడిన తర్వాత కూడా కొంతకాలం ఇతరులకు దూరంగా ఉండటం శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు. ఆ వ్యాది నయమైన తర్వాత కూడా దాని తాలుకూ వైరస్ ఇంకా శరీరంలో ఉంటుందని వైద్యులు వెల్లడించారు.

ముఖ్యంగా పురుషులు మంకీ ఫాక్స్ వ్యాధి నుండి కోలుకున్న తర్వాత కూడా వారి వీర్యంలో ఈ వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని ఇటీవల నిరూపణ అయింది. అందువల్ల వ్యాధి తగ్గిపోయిన వెంటనే స్త్రీ, పురుషులు సంపర్కంలో పాల్గొంటే.. పురుషుల వీర్యం ద్వారా స్త్రీలకు కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యాది నుండి కోలుకున్న తర్వత కూడా ఇతరులు తగలకుండా కొంతకాలం దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.