Health Benefits: మైగ్రెన్, డయాబెటిస్ నుంచి విముక్తి పొందాలంటే ఈ ఆకులు ఎంతో ప్రయోజనకరం?

Health Benefits: మనకు బాగా తెలిసిన పుల్లగా ఉంటు నోరూరించే కాయ నిమ్మకాయ. ఈ నిమ్మ చెట్లును దాదాపు ప్రతి ఇంటి వద్ద కూడా చూడవచ్చు ఈ కాయలను జ్యూస్ లాగా , కొన్ని వంట పదార్థాలలో కూడా ఉపయోగిస్తుంటాము. నిమ్మకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. కేవలం నిమ్మకాయలు మాత్రమే కాకుండా నిమ్మ ఆకులతో కూడా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ ఆకులలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో సిట్రిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అలాగే విటమిన్” సి ” కూడా ఈ ఆకులలో ఉంటుంది. ఈ ఆకులలో రసాన్ని సువాసన ఏజెంట్ గా కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆస్తమా, మైగ్రేన్ వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఒక ఆరు నిమ్మ ఆకులను వేడి నీటిలో 15 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని త్రాగడం వలన గుండెదడ, నరాల సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

ఈ నిమ్మ ఆకులో ఉండే సిట్రిక్ యాసిడ్ వల్ల మూత్రనాళాలు కూడా ఆరోగ్యంగా మారేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలలో రాళ్ల ను కూడా నివారిస్తుంది. ఈ ఆకులలో దొరికే విటమిన్ “c” కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే శరీర అభివృద్ధికి ,చర్మ కాంతికి కూడా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నదాని ప్రకారం నిమ్మ ఆకులో ఉండే ఒక సహజసిద్ధమైన సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తెలియజేస్తున్నారు. కాబట్టి మన జీవన శైలిలో ఈ నిమ్మ ఆకులను ఉపయోగించడం చాలా మంచిది.