ఈ వారసులకు సీఎం అయ్యే యోగ్యం లేదా!!

The TDP party will influence the Teresa party victory

వారసత్వ రాజకీయాలు ఇండియాలో కొత్తేమి కాదు. వారసులకు పార్టీని, రాష్ట్రాన్ని నడిపించే అర్హత ఉన్నా, లేకున్నా వారసులకు రాజకీయ బాధ్యతలు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వారసుల రాజకీయం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆల్రెడీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకైనా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో కేటీఆర్, ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యొక్క కొడుకు నారా లోకేష్ లకు కూడా భవిష్యత్ లో సీఎంలు అయ్యే అవకాశం ఉందా లేదా అనే చర్చలు వస్తున్నాయి.

కేటీఆర్ ను వద్దన్నా కేసీఆర్

తెలంగాణలో ఉన్న కొన్ని వారాల క్రితం వరకు తెలంగాణకు సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు తీసుకొనున్నారని వార్తలు వచ్చాయి. కానీ నేరుగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి ఇంకా పది సంవత్సరాలు తానే సీఎంగా ఉంటానని చెప్పడంతో కేటీఆర్ సీఎం వార్తలు ఆగిపోయాయి. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక పెద్ద వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణలో ఇంకా పార్టీని నడిపించేంత స్థాయి కేటీఆర్ కు లేదని, అలాగే కేటీఆర్ కు ప్రజల్లో కూడా సీఎం అయ్యేంత ఆదరణ లేదని కేసీఆర్ భావించే ఈ నిర్ణయం తీసుకున్నారుని తెలుస్తుంది.

లోకేష్ పరిస్థితి ఏంటి?

కేటీఆర్ కే సీఎం అయ్యే అర్హత లేదని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో నారా లోకేష్ గురించి ఆలోచిస్తే టీడీపీ నాయకులకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు వయసు అయిపోయింది. ఇలాంటి సమయంలో పార్టీని లోకేష్ నడిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ లోకేష్ కు మాత్రం రాష్ట్రంలో ప్రజల్లో అంత ఆదరణ లేదు. లోకేష్ ను ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ఒక్కసారి కూడా సీరియస్ గా తీసుకోలేదు. నారా లోకేష్ రాజకీయాల్లో తన స్థాయిని పెంచుకుంటే తప్ప రానున్న కనీసం పార్టీని నడిపించేలేరు. ఇద్దరు వారసులు రానున్న రోజుల్లో సీఎంలు అవుతారో లేదో చూడాలి.