Autism: తల్లిదండ్రులు పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ప్రస్తుత కాలంలో పిల్లల్లో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. తల్లిదండ్రులు ఎల్లప్పుడు పిల్లల ప్రవర్తనను పరిశీలిస్తూ ఉండాలి.ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో ” ఆటిజం ” సమస్య కూడా ఒకటి.ఇది న్యూరోలాజికల్ డిజార్డర్ అని వైద్య నిపుణులు వెల్లడించారు.
సాధారణంగా ఆటిజం అనేది మెదడుకు సంబంధించిన వ్యాది. ఈ వ్యాధికి సంబంధించిన లక్షణాలు పిల్లలలో విభిన్నంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో జన్యు పరమైన కారణాల వల్ల ఈ వ్యాది సంభవిస్తుంది. ఈ వ్యాది వల్ల పిల్లల మానసిక ఎదుగుదల సరిగ్గా ఉండదు. ఈ వ్యాధితో బాధ పడే పిల్లల్లో మెదడులోని కొంత భాగం సరిగా పనిచేయదు. అందువల్ల అందరి పిల్లల్లా మామూలుగా వీరి ప్రవర్తన ఉండదు. పిల్లలు జన్మించిన కొన్ని నెలల తర్వాత మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
పిల్లలు నెలలు నిండకముందే పుట్టడం, జన్యుపరమైన కారణాల వల్ల పిల్లలు ఏడాది దాటిన మాట్లాడకపోవడం, స్పర్శకు స్పందించే ఒక పోవడం వంటి ఆటిజం వ్యాది లక్షణాలు. ఈ వ్యాధికి నివారణ లేకపోయినప్పటికీ పిల్లల్ని ఎల్లప్పుడు గమనిస్తూ వారితో ఎక్కువ సమయం కడుపుతో ఉండటంవల్ల ఈ లక్షణాలను తగ్గించే అవకాశాలు ఉంటాయి. కొంతమంది పెద్దల్లో కూడా ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధికి చికిత్స లేనప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధి లక్షణాలను తగ్గించవచ్చు.