మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏపీలో స్థానిక ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అనూహ్యాంగా వైరస్ ప్రభల్లిడంతో ఎన్నికల కమీషన్ తేదీలు ప్రకటించి తాత్కాలికంగా వాయిదా వేసింది. ఆ తర్వాత రాష్ర్టంలో ఎలాంటి పరిస్థితులు అలుముకున్నాయో తెలిసిందే. దీంతో గత రెండు నెలలు గా ప్రజల్లో వైరస్ హాట్ టాపిక్ అయింది. తాజాగా దశలవారిగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తోన్న నేపథ్యంలో ఏక్షణంలో నైనా ఎన్నికలకు రగం సిద్ధం చేయమని సీఎం జగన్ అదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు ఎప్పుడైనా పై అధికారుల నుంచి అదేశాలు రావొచ్చొని దానికి తగ్గట్టు జిల్లా అధికారులు సిద్దంగా ఉండాలని అదేశాలు జారీ చేసారు. ఇళ్ల పట్టాలు, గ్రామవార్డు సెక్రటరియట్ భవనాల నిర్మాణం, ఫర్నీచర్, స్టేషనరీ, ఇంటర్ నెట్ సౌకర్యం, సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతోన్న సేవలు, స్థానిక ఎన్నికలపై ఆయన ఛాంబర్ లో అధికారులో చర్చించారు. కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం చికిత్స పొందుతున్న వరు డిశ్చార్జ్ అవ్వడంతో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశముందన్నారు. ఎన్నికల కమీషన్ ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివొచ్చని సంకేతాలిచ్చారు.
ఎన్నికల ప్రక్రియ ఏ స్థాయి నుంచి నిలిచిపోయిందో? అక్కడ నుంచే మిగిలిన పనులు కొనసాగుతాయన్నారు. పేదల ఇళ్లకు భూ సేకరణలోనూ, ఇళ్ల స్థలాలు కేటాయించడంలోనూ కొంత మంది మధ్యవర్తులు, అధికారులు సొమ్ము వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తుందన్నారు. అక్రమాలకు, అవినీతికి పాల్పడితే ఎవర్నీ వదలమని హెచ్చరించారు. ఇంటిలిజెన్స్ విభాగాలు క్షేత్ర స్థాయిలోనూ, కొన్ని టీమ్ లు ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్ పీటీసీ ఎన్నికలు పూర్తి చేయనున్నారు. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.