పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వంకూలిపోయింది. విశ్వాసపరీక్షలో నారాయణ స్వామి ప్రభుత్వం విఫలం అయ్యింది. దీనితో తో ఆయన తన రాజీనామా లేఖతో రాజ్ భవన్ కి బయలుదేరి వెళ్లారు. తన రాజీనామా లేఖను తమిళసై సౌందరరాజన్‌కు అందజేయనున్నారు. అధికార కూటమి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ 12కి పడిపోయిన విషయం తెలిసిందే.
మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురు రాజీనామా చేయడంతో 26కి చేరింది. దీంతో బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గాలంటే సాధారణ మెజార్టీకి 14 మంది సభ్యులు అవసరం. కానీ, కాంగ్రెస్ బలం స్పీకర్‌తో కలిసి 12కి పడిపోవడంతో బలపరీక్షలో సీఎం నారాయణసామి విఫలమయ్యారు. దీంతో సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్టు నారాయణసామి ప్రకటించారు.
కాగా, ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై ముందు మూడు అవకాశాలు ఉన్నాయి. బిజెపికూడా ఉన్న ప్రతిపక్ష కూటమికి బలం నిరూపించేందుకు అవకాశమివ్వడం లేదా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం, మూడు అసెంబ్లీని రద్దు చేయడం. లెఫ్టెనెంట్ గవర్నర్ తమిళ సై ఏ నిర్ణయం తీసుకుంటోందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.