అన్నాడీఎంకే – బీజేపీ కూటమికి మరో హీరో గుడ్ బై !

తమిళనాట అన్నాడీఎంకే – భారతీయ జనతా పార్టీకి గుడ్ బై కొట్టారు డీఎండీకే నేత విజయ్ కాంత్. సీట్ల పంపకాల విషయంలో తేడాలు రావడంతో ఆయన కూటమి నుంచి తప్పుకొన్నారు. అన్నాడీఎంకే – బీజేపీతో కలసి వెళ్లాలని విజయ్ కాంత్ పార్టీ డీఎండీకే నిర్ణయించింది. అయితే, సీట్ల షేరింగ్ విషయంలో ఆ పార్టీలు తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. సీట్ల పంపకాల విషయంలో మూడుసార్లు వారి మధ్య చర్చలు జరిగాయి.

Vijayakanth tests coronavirus positive: His condition is stable, says  hospital - Movies News

అయితే, అవి కొలిక్కి రాలేదు. విజయ్ కాంత్ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించలేదు. దీంతో విజయ్ కాంత్ ఆ కూటమి నుంచి తప్పుకొన్నారు.జయలలిత అన్నాడీఎంకే అధినేత్రిగా ఉన్న సమయంలో అన్నాడీఎంకే, డీఎండీకే కలసి పోటీ చేశాయి. ఆ తర్వాత మళ్లీ విడిపోయాయి. జయలలిత మరణానంతరం 2019 లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ అన్నాడీఎంకే – బీజేపీ కూటమితో కలసి నడిచారు విజయ్ కాంత్. ఆ ఎన్నికల్లో డీఎండీకేకు నాలుగు ఎంపీ సీట్లు కేటాయించారు.

అప్పటికే అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, పీటీ, ఎన్ జేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ముందస్తుగానే సీట్ల పంపకాలు చర్చించుకున్నా కూడా.. చివరి నిమిషంలో విజయ్ కాంత్‌కు కూడా సీట్లు సర్దుబాటు చేశాయి. ఇక అంతకు ముందు 2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 లోక్ సభ సీట్లలో అధికార అన్నాడీఎంకే 37 సీట్లు గెలుపొందింది. విజయ్ కాంత్ పార్టీ ఒక్క సీటు కూడా రాలేదు. ఆ ఎన్నికల్లో డీఎండీకేకు 5.1 శాతం ఓట్లు వచ్చాయి. అన్నాడీఎంకే – బీజేపీ కూటమి ఓ వైపు, డీఎంకే – కాంగ్రెస్ కూటమి మరో వైపు ఉన్నాయి. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ మూడో ప్రత్యామ్నాయంగా వస్తోంది. ఇక చిన్నమ్మ శశికళ ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.