Alovera Benifits: ప్రకృతిలో లభించే ఎన్నోరకాల మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుత కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు అందరిని వెంటాడుతున్నాయి. అటువంటి సమస్యలు జుట్టు రాలే సమస్య కూడా ఒకటి. ఒక వ్యక్తి అందంగా ఉండాలంటే జుట్టు ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాంటి ఇ జుట్టు సంరక్షణకై పాట్లు పడుతూ ఎన్నో డబ్బులు వెయిట్ చేస్తూ ఉంటారు.కానీ ప్రకృతిలో లభించే కలబంద మొక్క వల్ల ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, జుట్టు సంరక్షణకు ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దేశంలో నూటికి ఎనభై శాతం మంది ప్రజలు జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటివారు ఈ ఆయిల్ ను వారానికి రెండుసార్లు జుట్టుకు రాసుకోవడం వల్ల సమస్యలన్నీ తగ్గిపోతాయి.
జుట్టు సంరక్షణ కోసం కలబందను అనేక రకాలుగా వినియోగిస్తూ ఉంటారు. చాలామంది కలబందలోని గుజ్జు తీసి దానిని తలకు అంటించి గంట సేపటి తర్వాత స్నానం చేస్తారు. కానీ ప్రతిసారీ ఇలా చేయటం కన్న కలబంద తో నూనె తయారు చేసుకొని వారని రెండుసార్లు తలకు పట్టించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కలబంద నూనె ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కలబంద నూనె తయారు చేయటానికి ముందుగా రెండు లేదా మూడు కలబంద ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి అందులోని గుజ్జు తీయాలి. కలబంద గుజ్జును నున్నగా పేస్ట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత ఒక మందమైన గిన్నె తీసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె, కలబంద గుజ్జు వేసి బాగా కలుపుతూ చిన్న మంట మీద 10 నిమిషాలు బాగా మరిగించాలి. ఈ నూనె చల్లారిన తరువాత వడపోసి ఒక బాటిల్ లో ఎన్ని రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు.
ఈ కలబంద నూనె వారానికి రెండు సార్లు రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించి అరగంట బాగా మసాజ్ చేయాలి. ఉదయం లేవగానే గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు సార్లు ఈ నూనె వాడటం వల్ల జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గి జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.