‘రద్దు చేయక తప్పదు’ ? జగన్ ఫేవరెట్ సంక్షేమ పథకం – కష్టాల్లో..!

ap welfare schemes have financial issues

ఏ పార్టీకైనా సరే.. సంక్షమ పథకాలు అనేవి ఆయుధాలు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రచారాల్లో సంక్షేమ పథకాలను ముందు పెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు రాజకీయ నాయకులు. వాటి ఆశ చూపి ఓట్లు వేయించుకుంటారు. తర్వాత ఆ పథకాలు ప్రారంభం అవుతాయా? కావా? అనేది సెకండరీ. కానీ.. ఎన్నికల ముందు మాత్రం ఏ రాజకీయ నాయకుడైనా సరే.. తన నోటి నుంచి ఏ పథకం వస్తే.. ఆ పథకాన్ని అమలు చేస్తామని చెబుతాడు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కూడా.

ap welfare schemes have financial issues

సాధారణంగా రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని తరిమికొట్టడం కోసం, ఉపాధి కల్పించడం కోసం, పారిశ్రామిక అభివృధ్ది కోసం, రైతన్నల కోసం.. ఇలా పలు రకాల ప్రయోజనాల కోసం సంక్షేమ పథకాలను ప్రారంభిస్తారు. కానీ.. తర్వాత ప్రతి చిన్న దానికి కూడా సంక్షేమ పథకాన్ని అడ్డం పెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు.

ఒక రాజకీయ నాయకుడు పది హామీలు ఇస్తే.. ఇంకో రాజకీయ నాయకుడు 20 హామీలు ఇస్తాడు. నిజంగా గెలిచాక ఆ 20 హామీలు అమలవుతాయా? కావా? అంటే దానికి దేవుడే సమాధానం చెప్పాలి.

సరే.. అవన్నీ పక్కన పెడదాం.. మనం అసలు విషయానికి వద్దాం. రెబల్ ఎంపీ ఉన్నాడు కదా.. రఘురామకృష్ణంరాజు. ఆయన తాజాగా పెద్ద బాంబే పేల్చాడు. వైసీపీ సర్కారు ఇక నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని చెప్సేశాడు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చాక తాను ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చారో… ఆ హామీలను నెరవేర్చారు. చాలా సంక్షేమ పథకాలను కూడా ప్రారంభించారు. అయితే… ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయట.

దానికి కారణం కూడా చెప్పేశాడు ఆయన. అసలు ఏపీ ఖజానా ఎప్పుడో ఖాళీ అయిపోయిందట. రూపాయి లేదు అక్కడ. ఉద్యోగుల జీతాలకే దిక్కుదివానా లేదు. వేల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎక్కడి నుంచి డబ్బు తెస్తారు. ఇంకా ఎన్ని అప్పులు చేస్తారు. ఇకనుంచి అప్పులు చేయాలన్నా పుట్టవు.. అని ఆయన చెబుతున్నాడు.

మాట అంటే మాటే. మాట మీద నిలబడే మనిషిని అని సీఎం జగన్ చెబుతుంటారు. కానీ.. ఆ ఎంపీ చెప్పిన మాటను నిజం చేస్తారా? లేక ఎంత కష్టమైనా సంక్షేమ పథకాలను కొనసాగిస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.