అన్నదమ్ముల్లా కలిసి ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయ కుతంత్రాలకు బలై విడిపోయాయి.. పోనీ విడిపోయాక అయినా బాగుపడ్డాయా అంటే బాగుపడ్డాయి కానీ రాజకీయ కుటుంబాలు మాత్రమే బాగుపడ్దాయి. ప్రజల పరిస్దితి ఇదివరకంటే అధ్వాన్నంగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనే ఆశతో ప్రజలు తమ గోతిని తామే తవ్వుకున్నారు.. ఇక్కడ పరిస్దితులు ఇలాగే కొనసాగితే ప్రజలకు తుండు గుడ్ద తప్ప మిగిలేది ఏది ఉండదనే విషయాన్ని గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకుల మనోగతం.. ఇక ఏపీలో అధికార పార్టీ అప్పులు చేస్తున్నా ప్రజల కష్టాలు తీర్చడంలో వెనుకడుగు వేయడం లేదు.. అంతే కాక ఏపీ రాజకీయాల్లో సీయం కుటుంబపాలన ప్రభావం అసలు కనిపించడం లేదు.. మరి తెలంగాణాలో కుటుంబం కోసమే పార్టీ అనే పాలసీ క్లుప్తంగా తెలుస్తుందట..
ఇకపోతే ప్రస్తుతం ఏపీ, తెలంగాణల మధ్య పాత జలవివాదం పరిష్కారం కాక ముందే మరో కొత్త వివాదం కేంద్రం కోర్టులోకి చేరింది.. ఇదివరకు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు నెలకొనాలని, నది జలాలను పంచుకోవడంపై తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లతో స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగించాలని, గతంలో జల వివాదాలు పరిష్కరించాలని పలు మార్లు భేటీ అయిన తెలుగు రాష్ట్రాల సీఎంలు జలవివాదాల పరిష్కారంలో సక్సెస్ కాలేకపోయారన్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా ఈ వివాదం ఢిల్లీ చేరి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దగ్గరికి చేరింది.. ఈయన నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల సీయంలు చర్చలో పాల్గొననున్నారట..
నిజానికి ఇది ఏపీలోనో.. తెలంగాణలోనో.. జరిగితే.. దీని తాలూకూ ఇంపాక్ట్ వేరేగా ఉండేది. కానీ, నేరుగా ఢిల్లీలోని వెబినార్‌లో నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఏపీ ప్రభుత్వం కరువు పీడిత అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు అందించేందుకు సిద్ధమై.. ఈ ప్రాజెక్టు ఎత్తును పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్విన విషయం తెలిసిందే. ఎంతకు ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో కేంద్రం జోక్యం చేసుకో వలసిన పరిస్దితులు తలెత్తాయి.. కాగా బీజేపీతో తెలంగాణ సీయం బంధం అంతంత మాత్రమే, కానీ వైఎస్ జగన్ కేంద్రం ఏది చెబితే దానికి ఊ కొడుతూ ఏపీ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటు వస్తున్నారు.. పైగా కేసీయార్ మాత్రం మోదీని ఎప్పుడు ఆడిపోసుకుంటున్నాడు..ఈ నేపథ్యంలో కేంద్రం ఈ జల వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది..