జగన్ సి‌ఎం కుర్చీ ఎక్కిన తరవాత అతిపెద్ద డిజాస్టర్ ఇదే ??

AP stands second place in covid cases

మీకు గుర్తుందా? కరోనా వస్తే పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు… పారాసెటమాల్ మాత్ర ఒకటి వేసుకున్నా చాలు.. లేదంటే బ్లీచింగ్ పౌడర్ వాడినా చాలు.. కరోనాను తరిమేయొచ్చు. దానికి అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏంటి? అన్నట్టుగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. దానికి నెటిజన్లు కూడా సీఎం జగన్ కు ట్రోల్స్ రూపంలో బాగానే కామెంట్లు చేశారు.

AP stands second place in covid cases
AP stands second place in covid cases

కట్ చేస్తే.. ప్రస్తుతం కరోనా కేసుల్లో ఏపీ రెండో స్థానంలో నిలబడింది. ఒక్కసారిగా రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయి. రోజూ పెరుగుతూ పోతూనే ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు.

నిజానికి ఏపీలో పెద్ద పెద్ద నగరాలేవీ లేదు. అంటే మెట్రో నగరాలు లాంటివి లేవు. మెట్రో నగరాలు అంటే కోటికి పైగా జనాభా ఉంటుంది. అలా ఆ నగరాల్లో ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుంది. కానీ.. ఎటువంటి మెట్రో నగరం లేని ఏపీలో ఎందుకు ఇంతలా కరోనా వ్యాప్తి చెందింది.. అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

మొదటినుంచి కూడా మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ వస్తునన్నాయి. అక్కడ ఎక్కువ కేసులు పెరగడానికి కారణం ముంబై. రెండో స్థానంలో తమిళనాడు ఉండేది. కానీ.. రోజుకు కనీసం 10 వేలకు పైగా కేసులను నమోదు చేస్తూ… తమిళనాడును నెట్టేసి ఏపీ రెండో స్థానంలో నిలిచింది.

ముందుగా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు… కరోనాకు సెంటర్ ఆఫ్ ది పాయింట్ గా నిలిచినా.. తర్వాత ఆయా రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయడంలో సఫలం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పడుతోంది. కానీ.. విచిత్రంగా ఏపీలో మాత్రం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి.

నిజానికి ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రతి రోజూ ఏదో ఒక గొడవ ఏపీలో జరుగుతూనే ఉన్నది. రాజధాని గొడవ, అమరావతి రైతుల ధర్నా, విశాఖ లో ఇంకో గొడివ, కౌలు రైతుల గొడవ, రాజధాని భూముల గొడవ, ఇలా… ఏపీ ప్రతి రోజు ఏదో ఒక గొడవతో అట్టుడుకుతూనే ఉన్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు లోనూ రోజూ ఏపీకి సంబంధించిన ఏదో ఒక పిటిషన్ విచారణ జరపడమే.

ఇలా.. ప్రభుత్వం కూడా కరోనాపై దృష్టిపెట్టకుండా.. ఎందుకో రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నదని.. అందుకే ఏపీలో కరోనా కేసులు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే.. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటూ కేంద్రం లేఖ రాసినా కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి కరోనా గురించి మాత్రం సరైనా సమాధానం వెళ్లట్లేదట.