దేశంలో ఐదవ దశ లాక్ డౌన్ 5.0 అమలులో ఉంది. ఇక ఏపీలో లాక్ డౌన్ ఉందా? లేదా? అన్నది సరైన క్లారిటీ లేదు. తొలుత పటిష్టంగా అమలు చేసిన తర్వాత దాని రూపం పూర్తిగా మారిపోయింది. దాదాపు అన్నింటికి సడలింపులిచ్చింది ఏపీ సర్కార్. ఇందులో బస్సులు నడపడం అన్నది అతి పెద్ద టాక్స్ గా భావించిన ప్రభుత్వం అంతరాష్ర్ట సరిహద్దుల వరకూ బస్సులు నడపడం ప్రారంభించింది. అలాగే వాహనదారులు ఈపాస్ లు గానీ, ఎలాంటి అనుమతి పత్రాలు గానీ ఇకపై చూపించాల్సిన అవసరం లేదని రాష్ర్టంలో ఏ జిల్లా నుంచి ఏ జిల్లాకైనా ప్రయాణం చేవచ్చు అని తెలిపింది. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా అంతరాష్ర్ట బస్సు సర్వీసులకు అనుమతలిచ్చింది. దీంతో తెలంగాణలో ఉన్న ఏపీ వాసులంతా తిరుగ ప్రయాణం పడుతన్నారు.
అయితే ఈ విషయంలో ఏపీ పోలుసులు వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నారు. రాష్ర్టంలో ఉన్న పోలీస్ చెక్ పోస్టుల వద్ద ఒక్కో చెక్ పోస్ట్ వద్ద ఒక్కోలా వ్యవరిస్తున్నారు. కొందరు అధికారులు పాస్ లు అడుగుతున్నారు. ఇంకొందరు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోయినా పంపిచేస్తున్నారు. ఇంకొన్ని చెక్ పోస్ట్ ల వద్ద రక్తపరీక్షలు చేస పాజిటివ్ వస్తే ఆసుపత్రికి..లేకపోతే స్టాంప్ వేసి 14 రోజులు హోమ్ క్వారంటైన్ అని వేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు వాహనదారులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. గంటల కొద్ది వాహనాలు రోడ్లపై నిలివివేస్తున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నిబంధనల విషయంలో ఏపీ సర్కార్ సరైన మార్గదర్శకాలను విడుదల చేయలేదని, దీంతో పోలీసులు ఇష్టాను సారం వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పే దానికి…చేసే దానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. లాక్ డౌన్ రూల్స్ ప్రజలకు అని చెప్పి….పోలీసులు పాటించడం లేదని…రక్త నమూనాలు సేకరించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని అంటున్నారు.