కొంతమంది నమ్మినా నమ్మకపోయినా జగన్, కేసీఆర్ మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. రాజకీయాల పరంగా వీళ్లిద్దరి మధ్య విభేదాలు ఉన్నా 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వెనుక కేసీఆర్ ఉన్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు దాదాపుగా కన్ఫామ్ అయిందనే సంగతి తెలిసిందే. అయితే ఈ పొత్తు వల్ల కొంతమంది నాయకులు తమకు సీటు రాదని ఇతర పార్టీలపై దృష్టి పెడుతున్నారు.
కొంతమంది నేతలు వైసీపీ నుంచి టీడీపీలోకి మారనున్నారని సమాచారం అందుతోంది. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని భావించే నేతలు ఈ జాబితాలో ఉన్నారని బోగట్టా. గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరబోతున్నారని సమాచారం అందుతోంది. తెలంగాణలో అధికారంలో ఉండటం బీఆర్ఎస్ పార్టీకి ఒక విధంగా ప్లస్ అవుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఖర్చు విషయంలో కేసీఆర్ సాధారణంగా వెనుకడుగు వేయరని కొంతమంది భావిస్తారు. జగన్ కేసీఆర్ కు మద్దతు ఇవ్వకపోతే వైసీపీ నేతలలో కొంతమంది కీలక నేతలు బీఆర్ఎస్ లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జగన్ మాత్రం పొత్తుల విషయంలో ఆసక్తితో లేరు. అందువల్ల ఏం జరగబోతుందనే టెన్షన్ ఏర్పడింది.
కేసీఆర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. కేసీఆర్ పొలిటికల్ గా సక్సెస్ కావడానికి ఎన్నో ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో పార్టీ అధికారంలోకి రావాలంటే కేసీఆర్ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.