ఉద్యోగుల తప్పేముంది .. జగన్ సర్కార్ కు తప్పులు కనబడటం లేదా?

ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసేవాళ్లకు ప్రతి నెలా ఒకటో తేదీన కచ్చితంగా వేతనం జమవుతుందని ప్రజల్లో అభిప్రాయం ఉంది. ఈ రీజన్ వల్లే ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. అయితే ఈ మధ్య కాలంలో ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు జమ కాకపోవడం గురించి జోరుగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పథకాలను సక్రమంగా అమలు చేసే జగన్ సర్కార్ జీతాల విషయంలో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సకాలంలో ప్రభుత్వం జీతాలు ఎందుకు చెల్లించడం లేదనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరకడం లేదు. టీడీపీ పాలన అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడిన సందర్భాలు అయితే దాదాపుగా లేవనే చెప్పాలి.

తాజాగా ఉద్యోగ సంఘాలు సకాలంలో జీతాలు చెల్లించాలంటూ గవర్నర్ ను ఆశ్రయించడం గమనార్హం. ఇలాంటి వింత పరిస్థితి వైసీపీ పాలనలోనే ఎదురవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు భిన్నంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని కామెంట్లు వినిపిస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. జీతాల చెల్లింపునకు సంబంధించి ప్రస్తుతం ఎన్నో చర్చలు సైతం జరుగుతున్నాయి.

గత ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జీతాలను మాత్రం కరెక్ట్ గా చెల్లించేవి. జగన్ సర్కార్ మాత్రం ఈ విషయంలో ఫెయిల్ అవుతూనే ఉంది. అప్పులు చేసి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం జీతాల విషయంలో మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ కు తమ తప్పులు కనబడటం లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.