ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో భారీగా పోలింగ్… ఏ జిల్లాలో ఎక్కువంటే ?

open secret how consensus can be reached in panchayat elections

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంతో పోల్చుకుంటే పోలింగ్ శాతం భారీగా పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో 70.66 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 57.14 పోలింగ్ శాతం నమోదైంది. కృష్ణాజిల్లాలో అత్యధికంగా 75.90 ఓటింగ్ శాతం నమోదవగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 62.53 శాతం నమోదైంది. 12 మున్సిపల్ కార్పొరొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

AP Municipal Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.. ఆ జిల్లా ఓటర్లే టాప్

రాష్ట్ర వ్యాప్తంగా 578 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో వైసీపీ 570, టీడీపీ 6, బీజేపీ 1 ఇతరులు ఒక వార్డును ఏకగ్రీవం చేసుకున్నారు. శ్రీకాకులం జిల్లాలో 71.52 శాతం పోలింగ్ నమోదవగా.. విజయనగరం జిల్లాలో 74.61 %, విశాఖపట్నం జిల్లాలో 74.63%, తూర్పుగోదావరి జిల్లాలో 75.93%, పశ్చిమ గోదావరి జిల్లాలో 71.54%, కృష్ణాజిల్లాలో 75.90, గుంటూరు జిల్లాలో 69.19% ప్రకాశం జిల్లాలో 75.46% నెల్లూరు జిల్లాలో 71.06 %, అనంతపురం జిల్లాలో 69.77%, చిత్తూరు జిల్లాలో 69.60%, కడప జిల్లాలో 62.53% పోలింగ్ నమోదైంది.

మున్సిపల్ కార్పొరేషన్లను పరిశీలిస్తే..
విజయనగరంలో 63.98 శాతం, విశాఖపట్నంలో 56.01 శాతం, ఏలూరులో 56.33 శాతం, మచిలీపట్నంలో 71.14 శాతం, విజయవాడలో 56.81 శాతం, గుంటూరులో 57.15 శాతం, ఒంగోలులో 75.52 శాతం, అనంతపురంలో 56.41 శాతం , కర్నూలులో 49.26 శాతం, కడపలో 54.85 శాతం, చిత్తూరులో 66.06 శాతం, తిరుపతిలో 53.44 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈనెల 14న వెలువడనున్నాయి. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఫలితాలను ప్రకటిస్తారు. మరోవైపు విజయావకాశాలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలతో పాటు జనసేన-బీజేపీ కూటమి కూడా ధీమాతో ఉంది.