వాళ్లకు 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం… సీఎం జగన్ సంచలన ప్రకటన

ఎలక్షన్ టైంలో ఉన్న కోపం, జోష్ మళ్లీ జగన్‌లో ఇప్పటికీ కనిపించాయి

ప్రస్తుతం మానవాళి అంతా కరోనాతో పోరాడుతోంది. ఈ కరోనా వల్ల ప్రపంచమంతా స్తంభించిపోయింది. ఎక్కడివారు అక్కడే. బయటికి వెళ్లే చాన్స్ లేదు. వెళ్తే ఏమౌతుందో తెలియదు. ఎక్కడ కరోనా అంటుకుంటుందో అని జనాలు బయటికి వెళ్లడం కూడా మానేశారు. కానీ.. డాక్టర్లు అలా కాదు కదా. ప్రపంచం మొత్తం ఆగిపోయినా డాక్టర్లు మాత్రం తమ డ్యూటీ చేస్తూనే ఉండాలి. కరోనా సోకిన వాళ్లకు ట్రీట్ మెంట్ చేస్తుండాలి.

ap govt togive govt jobs to family members of doctors who died with corona

ఇటువంటి క్లిష్ట సమయంలో విధులు నిర్వర్తించి… ఎంతో మంతి ప్రాణాలు కాపాడిన డాక్టర్ల కోసం జగన్ సర్కారు మంచి నిర్ణయాన్న తీసుకున్నది. చాలామంది డాక్టర్లు కరోనా చికిత్స అందిస్తూ.. కరోనా సోకి చనిపోయారు. దీంతో వాళ్ల కుటుంబాలు అనాథలుగా మారాయి.

అందుకే… అలా డ్యూటీలో కరోనా సోకి చనిపోయిన ప్రభుత్వ డాక్టర్ల కుటుంబ సభ్యులను ఆదుకోవడం కోసం.. వాళ్ల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి సమాయత్తమవుతోంది. అది కూడా డాక్టర్ చనిపోయిన 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన ఆదేశాలను కూడా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జారీ చేశారు.

దీనికి సంబంధించిన వివరాలను డీఎంహెచ వో కానీ డీసీహెచ్ఎష్, సుపరిండెంట్ కానీ వివరాలు జిల్లా అధికారులకు పంపిస్తే.. వాళ్లు వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత డాక్టర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరగుతుంది.