కొందరు ఎలా ఉంటారంటే.. పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడుస్తారు. పక్కనే ఉంటూ గోతులు తవ్వుతారు. సరిగ్గా చెప్పాలంటే తిన్నింటి వాసాలు లెక్కిస్తారు. తాజాగా ఏపీలోనూ అలాగే జరుగుతోందట. ఏపీ సీఎం జగన్.. తన సొంత పార్టీ నేతలపై ఫుల్లు సీరియస్ గా ఉన్నారట. అసలు.. పార్టీలో ఏం జరుగుతోందని టెన్షన్ పడుతున్నారట.
పార్టీ పరువును గంగలో కలిపేస్తేన్నారని కొందరు నేతలపై జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వైజాగ్ లో వైఎస్సార్సీపీ డీడీఆర్సీ మీటింగ్ లో జరిగిన విషయంపై పార్టీ అధినేతగా జగన్ సీరియస్ గా స్పందించారట.
వెంటనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు ఎంపీ విజయసాయిరెడ్డిని, ఇద్దరు ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, అమర్నాథ్ ను పిలిపించారట. అసలు అక్కడ మీటింగ్ లో ఏం జరిగింది.. అనే విషయాన్ని వాళ్లను అడిగి ముఖ్యమంత్రి తెలుసుకున్నారట.
విశాఖ మీటింగ్ లో వైసీపీ నేతలు.. నాడు – నేడు, భూముల విషయంపై ఒకరిని మరొకరు విమర్శించుకున్నారు. అది మీడియాలో రావడంతో ఆ విషయం జగన్ వరకూ వెళ్లింది. దీంతో జగన్ ఆ ఆంశంపై సీరియస్ అయ్యారు.
ఈ మీటింగ్ లో ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ విజయసాయి చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. విజయసాయిరెడ్డి అయితే.. ఎమ్మెల్యే ధర్మశ్రీని టార్గెట్ చేస్తూ… ఇటీవల జరిగిన భూఅక్రమాలను ఉద్దేశించి వ్యాఖ్యనించగా.. వెంటనే ఎమ్మెల్యే కరణం అభ్యంతరం వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ కూడా సీరియస్ అయ్యారు. ఈ విషయం జగన్ దాకా వెళ్లడంతో.. వీళ్లు పార్టీ పరువును గంగలో కలిపేస్తున్నారని.. వాళ్లను పిలిచి మరీ జగన్ సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది.