ప్రస్తుతం రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే.. కొందరు రాజకీయాల్లోకి ఏదో చేద్దామని వస్తారు.. ఇంకొందరు మాత్రం ఏం చేయకుండా.. ప్రజలను దోచుకోవడానికి వస్తారు. మరికొందరు మాత్రం తమ పైవాళ్లను కిందికి లాగి పైకొస్తుంటారు. ఇలా రాజకీయాల్లో ఎప్పటికప్పుడు నాయకులు ట్రెండ్స్ కు అనుగుణంగా మారుతూనే ఉంటారు. ఇంకొందరైతే ఏకంగా అన్నం పెట్టిన పార్టీ పరువును గంగలో కలిపేస్తుంటారు. ఇప్పుడు మనం చదువుకోబోయే స్టోరీ అదే.
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆ జిల్లాలోని దర్శి నియోజకవర్గం వైసీపీ నేతలు తమ రాజకీయాలను రోడ్డున పడేశారు. తమ రాజకీయాలే రోడ్డున పడితే పర్వాలేదు కానీ.. ఏకంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వైసీపీని కూడా రోడ్డున పడేశారు. దీంతో సీఎం జగన్ తల పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిజానికి.. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. మధ్యమధ్యలో టీడీపీ గెలిచినా..చివరకు 2019 ఎన్నికల్లో మాత్రం వైసీపీకి చిక్కింది. మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నుంచి గెలుపొందారు. అంతే కాదు.. ఆయనకు దర్శిలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. మరోవైపు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన శిద్దా రాఘవరావు వైసీపీలో చేరడంతో అసలు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి.
అంతే కాదు.. 2014 లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బూచేపల్లి… రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తర్వాత నియోజకవర్గం ఇన్ చార్జ్ ను కూడా జగన్ మార్చేశారు. వేణుగోపాల్ కు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన 2019లో గెలిచారు.
కానీ.. ఇప్పుడు బూచేపల్లి మళ్లీ వచ్చి.. తన నియోజకవర్గాన్ని తనకే ఇవ్వాలంటూ పేచీ పెడుతున్నారు. ఎమ్మెల్యే వేణుగోపాల్ కు వ్యతిరేకంగా పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నారట. దీంతో ఇరు వర్గాల మధ్య రచ్చ జరుగుతోంది. రెండు వర్గాలు రోడ్డు మీదికి వచ్చి మరీ కొట్టుకునే వరకు వచ్చింది.
ఈ విషయమే జగన్ వద్దకు కూడా చేరిందట. అప్పుడు జగన్ చెబితే బూచేపల్లి వినలేదు. అందులోనూ ఆయన రెడ్డి సామాజిక వర్గం. వేణుగోపాల్ ప్రస్తుతం ఎమ్మెల్యే. ఏం చేయాలి.. ఇద్దరు కలిసి పార్టీని బజారునకీడ్చుతున్నారని.. ఇలాంటివి ఇంకోసారి రిపీట్ కాకూడదని.. జగన్ గట్టి నిర్ణయమే తీసుకున్నారట. చూడాలి మరి.. జగన్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో?