ఓవైపు కరోనా తెలుగు రాష్ర్టాల్లో పంజా విసురుతోంది. ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో పోటా పోటీగా పాజిటివ్ కేసులు..డెత్ రేట్ నమోదవు తోంది. అయితే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంత మాత్రం అదిరేది లేదు..బెదిరేది లేదు . కరోనాతో పెద్ద యుద్ధమే చేస్తున్నారు. కరోనాని ఎన్ని రకాలుగా ఎదుర్కోవాలో అన్ని రకాలుగాను ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉన్నారని ఆయన యంత్రాంగం పనితీరు చూస్తుంటే స్పష్టమవుతోంది. కరోనాని సమర్ధవంతంగా ఎదుర్కుంటూ ఇతర రాష్ర్టాలకే ఆదర్శంగా నిలుస్తున్నారు. కరోనా పరీక్షలు చేయడంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది. కరోనాకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని యుద్ధ ప్రాతిపదికన ఎప్పటికప్పుడు సమకూర్చుకుంటోంది.
అది లేదు..ఇది లేదు అన్న విమర్శలకు తావు ఇవ్వకుండా యంత్రాంగం పనిచేస్తోంది. గ్రామాలలో జగన్ ని వ్యతిరేకించే వాళ్లే కరోనా విషయంలో సీఎంగారు అంటూ అంటే ప్రశంసిస్తున్నారు. కరోనాని ఆరోగ్య శ్రీలోకి తీసుకురావడంతో ప్రతీ పేద కుటుంబం ధీమాగా ఉంది. కరోనా సోకిన కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొవచ్చని ఓ ధీమాను జగన్ కల్పించడం నిజంగా గ్రేట్ అంటున్నారు. కరోనాతో మరణించిన వారికి అంత్యక్రియల నిమిత్తం 15 వేల రూపాయలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది. కరోనా సోకి వ్యాధి నయమైన తర్వాత అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం చేస్తోంది. రాష్ర్ట ఖజానా ఖాళీగా ఉన్న జగన్ మాత్రం ప్రజల ప్రాణాల విషయంలో ఎంత మాత్రం వెనుకడుగు వేయలేదు. నిజమే దేశంలో ఇప్పటివరకూ ఏ రాష్ర్టం ఇలా చర్యలు తీసుకోలేదు.
తాజాగా జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికి కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. కరోనా అని అనుమానం ఉన్న వాళ్లు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే ఇంటికే వైద్య సిబ్బంది వచ్చి స్వాబు టెస్ట్ కోసం శాంపిల్ తీసుకుంటారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఈప్రక్రియ పూర్తవుతుంది. ప్రతీ ఒక్కరికి టెస్టులు అందుబాటులో ఉండాలనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు చూస్తుంటే కేంద్రమే షేకై అయి షాక్ అవ్వడం ఖాయం.