నంద్యాలలో ఇటీవల ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నంద్యాలకు చెందిన సలాం అనే వ్యక్తి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు.
మేము ఎక్కడా ఈ కేసులో తన మన భేదం చూపించలేదు. ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఫ్యామిలీ సూసైడ్ కు బాధ్యులైన పోలీసులను కూడా అరెస్ట్ చేశాం. అయిన్పటికీ టీడీపీ నేత, లాయర్ రామచంద్రారావు బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ రద్దు కోసం కూడా కోర్టులో అప్పీల్ చేస్తామని సీఎం జగన్ తెలిపారు.
తమపై అన్యాయంగా దొంగతనం కేసును బనాయించి.. నంద్యాల పోలీసులు వేధిస్తున్నారని… ఈనెల 3వ తారీఖున సలాం కుటుంబం మొత్తం సెల్ఫీ వీడియో తీసి మరీ.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంటనే ప్రభుత్వం ఆ ఘటనపై విచారణ ప్రారంభించింది. సలాం కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులైన సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే.. వారు వెంటనే బెయిల్ పై విడుదలవ్వడంతో ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈనేపథ్యంలో సీఎం జగన్ ఈ కేసుపై స్పందించారు. బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.