ఏపీ బీజేపీ నేతలు మొద్దు నిద్ర వదలండయ్యా

ap bjp telugu rajyam

 విజయవాడ కేంద్రంగా మొన్ననే రెండు కీలకమైన ప్రాజెక్టు లు పూర్తయి, ప్రారంభం అయ్యాయి. అందులో ఒకటి బెంజ్ సర్కిల్ దగ్గర నిర్మించిన ప్లే ఓవర్, మరొకటి కనకదుర్గ ఫ్లైవోవర్. ఇవి రేండు జాతీయ రహదారుల పరిధిలోనివి కావటం విశేషం. కనుకదుర్గ ఫ్లైవోవర్ అత్యాధునిక హంగులతో దక్షిణాది రాష్ట్రాల్లోనే తొలి అపూర్వ వంతెనగా.. దేశంలో మూడోదిగా ఇది రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టు మోడీ హయాంలోని శంకుస్థాపన జరుపుకొని ఆయన హయాంలోని ప్రారంభం అయ్యింది.

Kanakadurga flyover telugurajyam

 

 ఇందులో గొప్ప విశేషమేమీ ఉందని మీరు అనుకోవచ్చు, ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 502 కోట్లు ఖర్చుపెట్టారు. ఇందులో 355 కోట్లు మోడీ సర్కార్ ఇచ్చింది. మిగిలిన 147 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అందుకే ఎంత ఆలస్యమైనా సరే, కేంద్ర మంత్రితోనే ఈ ప్లే ఓవర్ ను ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం ఒక పక్క వైసీపీ లాగేసుకోవాలని చూస్తూనే, మరోపక్క టీడీపీ కూడా తమ హయాంలోనే ప్రాజెక్టు చాలా వరకు పూర్తైయ్యింది. కాబట్టి ఆ ఘనత మాకు దక్కాలి అంటూ ప్రచారం చేసుకుంటుంది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం మాకేమి సంబంధం లేన్నట్లు వ్యవహరించటం విడ్డురంగా ఉంది. ఈ ప్రాజెక్టు కు మెజారిటీ వాటా కేంద్రంలో వున్నా బీజేపీ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఆ క్రెడిట్ లో బీజేపీ వాటా ఎక్కువగానే ఉంటుంది.

  దానిని హైలైట్ చేసి, అభివృద్ధికి మేం కేరాఫ్.. అని చెప్పుకోవాలా? లేదా? మా సత్తా.. ఇదీ! అని ప్రచారం చేసుకోవాలా? వద్దా!! అయితే ఇవేమి పట్టించుకునే స్థితిలో ఏపీ బీజేపీ ఉన్నట్లు కనిపించటం లేదు. ఇలాంటి వాటిని హైలైట్ చేసుకొని, పార్టీకి కొంచమైనా మంచి పేరు తీసుకోని వద్దామనే స్థానిక బీజేపీ అగ్ర నేతల్లో అంజనం వేసి వెతికిన కనపడటం లేదు. ఒక్క రాష్ట్ర స్థాయి నేతకూడా దీనిపై మాట్లాడిన పాపాన పోలేదు. ప్రతి చిన్న దానికి తగువులమ్మ అంటూ వచ్చే ఏపీ బీజేపీ చీఫ్ దీనిపై అసలు స్పదించకపోవటం విశేషం. ద్వితీయ శ్రేణి నేతలు నయం ఈ ప్రాజెక్టు లో బీజేపీ వాటా గురించి ప్రచారం చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళని చూసైనా అగ్రనేతలు స్పదిందిస్తారో లేక , ఎన్నికలు ఇప్పుడు లేవుకదా 2024 సమయానికి మెల్లగా మాట్లాడవచ్చులే అనే ధోరణిలో మొద్దు నిద్ర పోతారో చూడాలి.