AP: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జులై 31వ తేదీ నెల్లూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే నెల్లూరు జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈయన పరామర్శించారు అదేవిధంగా వేమిరెడ్డి ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులను కూడా ఈయన పరామర్శించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా పెద్ద ఎత్తు పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఏమాత్రం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు అంటూ వైసీపీ అనుకూల మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇకపోతే ఈ పర్యటనలో జనాలు లేరని, ఇలా జనాలు లేకపోవడంతో ఉన్నట్టు చిత్రీకరించడం కోసం పాత వీడియోలను జోడించి ప్రచారం చేసుకుంటున్నారు అంటూ ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత జగన్ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పర్యటనలో జనాలు లేకపోవడంతోనే పాత టూర్లకు సంబంధించిన వీడియోలను ప్లే చేస్తున్నారని ఆమె తెలియజేశారు. జనాలు లేకపోయినా ఉన్నారని మభ్య పెట్టడానికి, లేనిది ఉన్నట్టు చిత్రీకరించడానికి ఇంతలా దిగజారాలా అంటూ ప్రశ్నించారు. జగన్ పర్యటనకు సంబంధించి 50 సెకండ్ల వీడియోలో పాత టూర్లకు సంబంధించిన వీడియోలను మిక్స్ చేసి ప్రజలకు ఏం తెలియజేయబోతున్నారంటూ ప్రశ్నించారు.
నాణెం ఒకవైపు మాత్రమే కాదు మరోవైపు కూడా చూపిస్తాం అంటే ఇదేనా అంటూ అనిత ప్రశ్నించారు అదేవిధంగా ఈయన ఏ పర్యటనకు వెళ్ళినా పోలీసుల తీరును విమర్శించడం పట్ల అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జగన్ నెల్లూరు పర్యటనలో భాగంగా ఈయన చిత్తూరు బంగారుపాలెం పర్యటనకు సంబంధించిన కొన్ని విజువల్స్ ప్లే కావడంతో జగన్ కు ప్రజాధరణ ఏమాత్రం లేదని ఇలా పాత టూర్లకు సంబంధించిన వీడియోలను ప్లే చేస్తూ పబ్బం గడుపుతున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుతం హోం మంత్రి అనిత చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
