Home News అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

అనుష్కకు కాబోయే వరుడు ఇతనే!?

టాలీవుడ్ క్రేజీ బ్యూటీ అనుష్క పెళ్లి వార్తలు ఇవ్వాళ కొత్తేమీ కాదు. అయితే మరోసారి ఈ అమ్మడు త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్త చక్కర్లు కొడుతోంది.  అది కూడా తమ దగ్గరి బంధువు పెళ్ళికొడుట. గతంలో ఎన్నో సార్లు ఆమె డేటింగ్ లో ఉన్నట్లు రూమర్లు వచ్చాయి.

Anushka Shetty

ముఖ్యంగా ప్రభాస్ తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ఏళ్ళ తరబడి గాసిప్పులు  పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఆ విషయంలో చాలా సార్లు ప్రభాస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముందు ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే గాని ఆ రూమర్సు ఆగవని  క్లియర్ గా చెప్పాడు.  అనుష్క కూడా చాలాసార్లు ఆ రూమర్సు పై స్పందించింది గాని అంతగా వర్కౌట్ కాలేదు.

తాజాగా  అనుష్క తీసుకుంటున్న నిర్ణయాలను భట్టి ఆమె పెళ్లికి సిద్ధమైనట్లు మరొక రూమర్ వైరల్ గా మారింది. కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరిపినట్లు టాక్ వస్తోంది. అందుకే అనుష్క కూడా చాలా తక్కువ సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటిటీలోనే నిశ్శబ్దం.. బాహుబలి, భాగమతి అనంతరం అనుష్క నుంచి పెద్దగా సినిమాలు ఏమి రాలేదు. సైరాలో ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ బ్యూటీ లాంగ్ గ్యాప్ ఇచ్చిందనే చెప్పాలి.  

ఇక అఫీషియల్ గా అనుష్క ఇంతవరకు వేరే సినిమాలకు సైన్ చేసినట్లు ప్రకటించలేదు. కథలు వినడానికి కూడా అనుష్క పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది. ఇక పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే సినిమాలు తగ్గించిందనే టాక్ వస్తోంది.అయితే తాజా కబురు పెళ్లి వార్తే అంటున్నారు. చూద్దాం ఈ సారైనా పెళ్లి బాజా మోగుతుందో !?

Related Posts

ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు: ‘మా’ యుద్ధంలో గెలుపెవరిది.?

సినీ పరిశ్రమలో నటీనటుల సంఘం 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (మా) వుంది.. అందులో సభ్యుల సంఖ్య వెయ్యి లోపే. అందులో యాక్టివ్ మెంబర్స్ చాలా చాలా తక్కువ. కానీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ,...

నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ గేమ్ ఛేంజర్ అవుతుందా.?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకొచ్చేస్తోంది. ఈ సినిమా కంటే, నాగచైతన్య - సమంత విడిపోతున్నారా.? కలిసే వుంటారా.? అన్న...

Related Posts

Latest News