రాష్ట్రంలో టీడీపీని పూర్తిగా భూస్థాపితం చేయాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారని ఆయన చేస్తున్న పనులను చూస్తుంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇప్పటికే అవసరం లేకపోయినా నలుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నుండి వైసీపీలోకి ఆహ్వానించారు. అయితే టీడీపీని దెబ్బతిస్తూ, చంద్రబాబు నాయుడుని కనీసం ప్రతిపక్ష హోదాలో కుల ఉండకుండా చేయాలన్న లక్ష్యంతోవైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారు.
మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి!
ఉత్తరాంధ్రకు చెందిన మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వాసుపల్లి గణేష్ టీడీపీ నుండి వైసీపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జగన్ యొక్క గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ జగన్ గత కొన్ని రోజుల నుండి ఉత్తరాంధ్ర రాజకీయాలపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడు. అక్కడ వైసీపీని బలపరచడానికి సిద్ధపడుతున్నారు. ఎలాగూ సీమతో పాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తనకు అనుకూలంగానే ఉంటాయి. ఇక ఉత్తరాంధ్రను తిప్పేసుకుంటూ తన సీఎం పీఠానికి ఢోకా ఉండదన్నదే జగన్ ప్లాన్.
ఎప్పుడు రానున్నారు?
ఈ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడే వైసీపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అయితే జగన్ మోహన్ రెడ్డి వాళ్ళకు సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎందుకంటే కరెక్టు గా అసెంబ్లీ సమావేశాల సమయంలో వీళ్ళను పార్టీలోకి తీసుకొని చంద్రబాబు నాయుడిని ప్రతిపక్ష హోదాను కూడా తీసేయాలని జగన్ పతకం రచించారు. ఈ పతకం అమలు జరిగితే టీడీపీకి, చంద్రబాబు నాయుడుకి రానున్న రోజుల్లో ఘోర అవమానం జరగనుంది.