స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లాస్ట్ సినిమా పుష్ప తో తాను పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. దీనితో అయితే మరో పక్క ఇప్పుడు పుష్ప కి కొనసాగింపుగా అనౌన్స్ చేసిన పుష్ప ది రూల్ పై అనేక స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
మరి ఇదిలా ఉండగా ఈ చిత్రం ని సుకుమార్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోగా అంతే గ్రాండ్ లెవెల్లో అయితే సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాపై అనేక రూమర్స్ కూడా గట్టిగానే మొదలయ్యాయి.
సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో పాన్ ఇండియా ఆడియెన్స్ కి గట్టిగా సినిమా వైపు చూసేలా చెయ్యాలని సాలిడ్ ప్లాన్ లు చేస్తున్నాడు. అందులోభాగంగా బాలీవుడ్ నుంచి స్టార్స్ ని దింపుతున్నాడనే రూమర్స్ గట్టిగా ఉన్నాయి. కానీ ఇపుడు మరో ఊహించని రూమర్ ఏమిటంటే ఈసారి ఏకంగా హేతో సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేస్తున్నాడని అంటున్నారు.
కానీ ఇందులో అయితే ఇంకా ఎంతవరకు నిజం ఉందో తెలియలేదు. ముందు అయితే అర్జున్ కపూర్ పేరు దీనికి వినిపించగా ఇప్పుడు సల్మాన్ పేరు వచ్చిందని బాలీవుడ్ వర్గాలే చెబుతున్నాయి. ఇంకా దీనిలో అయితే ఎంత నిజం ఉంది అనేది చూడాలి.
