వెలుగులోకి వచ్చిన మరో కొత్త వైరస్.. భయాందోళనలో ప్రజలు!

ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వైరస్ బాగా వణికించింది. తగ్గుముఖం పట్టినట్లే పట్టి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దక్షిణ కొరియా, సింగపూర్, చైనా వంటి పలు దేశాలలో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు వైరస్ తో సతమతం అవుతున్నారు. ఇక తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది.

హార్ట్ లాండ్ వైరస్ అనే పేరుతో అమెరికాలో కొత్త వైరస్ కలకలం రేపింది. ఈ వైరస్ నల్లుల నుంచి వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ వైరస్ జార్జియా తో సహా ఐదు రాష్ట్రాలలో వ్యాప్తి చెందిందని తెలిసింది. ఈ వైరస్ సోకిన వారికి అవయవాలు పని చేయవని, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి లేకపోవడం, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిసింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.