జగన్ ని అంతమాట అనేశారు ఏంటి.. దీనికి సమాధానం ఉందా?

Another blame on ap cm ys jagan mohan reddy

టీడీపీ పార్టీ రూటే సపరేటు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నా.. ప్రభుత్వంపై ఆరోపణలు చేయాలన్నా.. ఇంకేం చేయాలన్నా కూడా టీడీపీ వివిధ రకాల సాధనాలను ఎంచుకుంటుంది. దాంట్లో ముఖ్యమైనది సోషల్ మీడియా. టీడీపీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా సెటపే ఉంది.

Another blame on ap cm ys jagan mohan reddy
Another blame on ap cm ys jagan mohan reddy

సీఎం జగన్ ఏదైనా తప్పు చేస్తూ దొరికితే చాలు.. అడ్డంగా పట్టేసుకుంటారు. వెంటనే టీడీపీ సోషల్ మీడియా వింగ్ రెడీ అయిపోతుంది. వెంటనే సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు.

తాజాగా టీడీపీ సోషల్ మీడియా వింగ్ ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయింది. జగన్ పై వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించింది. సీఎం జగన్ ముస్లింల త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం పండుగను ఉద్దేశించి ఓ ట్వీట్ ను పెట్టారు. మైనార్టీ నేతలకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ను ఇఫ్పుడు టీడీపీ జగన్ పై విమర్శల కోసం వాడుకుంటోంది.

మొహర్రం నిజానికి ముస్లింల త్యాగానికి ప్రతీక. కానీ.. సీఎం జగన్ శుభాకాంక్షలు ఎలా చెబుతారు? అది విషాద రోజు కదా.. ఆమాత్రం తెలియదా? అంటూ సోషల్ మీడియా వింగ్ రెచ్చిపోయింది.

అయితే.. ఇందులో జగన్ చేసిన తప్పయితే కనిపించడం లేదు కానీ.. కావాలని వీళ్లు దాన్ని పెద్దది చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే.. మైనార్టీలకు శుభాకంక్షలు చెప్పడం పెద్ద తప్పు అన్నట్టుగా సోషల్ మీడియాలో టీడీపీ వింగ్ దుష్ప్రచారం స్టార్ట్ చేసింది.

మరి.. టీడీపీ మీడియా రెచ్చిపోతే.. వైసీపీ మీడియా ఊరుకుంటుందా? వాళ్లకు కూడా సెటప్ ఉంది కదా. వెంటనే టీడీపీపై యుద్ధం ప్రారంభించారు. పచ్చ కళ్లద్దాలు పెట్టుకున్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. మీరు ఎలాగూ నాశనం అయిపోయారు కాబట్టి మీరు ఏడుస్తూనే ఉండండి. మైనార్టీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెబితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఎప్పుడూ జగన్ మీద పడి ఏడ్వడం తప్పితే మీకు ఇంకో పని లేదా? వాళ్లను కించపరచాలన్న ఉద్దేశంలో సీఎం జగన్ అలా చెప్పారా? లేదు కదా.. వాళ్ల పవిత్ర త్యాగాన్ని ఉద్దేశించి చెబితే దానిపై కూడా ఈకలు పీకుతున్నారంటే టీడీపీ ఎంతకు బరితెగించిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతల ఆలోచనా విధానం ఎలా ఉందో వీళ్ల ప్రవర్తన బట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకే కదా.. ఏపీ ప్రజలు టీడీపీని ఘోరంగా ఓడించారు. అయినా కూడా బుద్ధి రాకపోతే ఎట్లా.. అంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ రెచ్చిపోయింది. దీంతో రెండు పార్టీల సోషల్ మీడియా వింగ్ ల నుంచి కామెంట్లే కామెంట్లు. చివరకు ఎవరికో ఒకరికి విరక్తి వచ్చేదాకా వీళ్ల కామెంట్ల వర్షం కురుస్తూనే ఉంటుంది.

తెల్లారితే మళ్లీ ఇంకో ఇష్యూ.. ఇంకో పోస్టు.. ఇంకో దాడి.. ఇంకో ప్రతిదాడి.. ఇది ఎక్కడైనా కామనే కదా. కానీ.. ఏపీలో మాత్రం టీడీపీ సోషల్ మీడియా వింగ్.. అయినదానికి.. కానిదానికి కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.