ఏపీలో ప్రస్తుతం వైసీపీ గాలి వీస్తుందట.. అందుకే అధికార పార్టీలోకి ప్రతిపక్ష నాయకుల వలసలు వరదలుగా పెరిగాయంటున్నారు.. ఇక ప్రతిపక్షాన్ని బలహీనం చేయాలంటే రాజకీయ వలసలను ప్రోత్సహించాలనే దిశగా జగన్ అడుగులు వేయడం.. దీనికి భారీగానే స్పందన వచ్చి అనుకున్న విధంగానే వైసీపీ, టీడీపి కార్యకర్తలతో కిటకిటలాడటం కనిపిస్తుంది.. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ వలసల వల్ల లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట.. ఎప్పటినుండో జగన్‌ను నమ్ముకున్న నాయకులు.. ఇంతకు చెప్పచ్చేది ఏంటంటే.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబును ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న విషయం తెలిసిందే.. ఇలా వైఎస్ జగన్ ధాటీకి ఆ పార్టీ నాయకులు అందరు చెల్లాచెదురు అయ్యారు..
ఈ దశలో వైసీపీని ఏపిలో బలోపేతం చేసి ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం సీయం జగన్ ప్రణాళికలో భాగంగా వలసల పధకాన్ని ప్రవేశ పెట్టారు.. దీనికి నాయకుల్లో ఆదరణ భారీగా పెరిగిపోయి ఇప్పుడు ఓవర్ లోడ్ అవుతుందని మొదటి నుంచి పార్టీని నమ్ముకుని కాలం వెళ్లతీస్తున్న నాయకులు గగ్గోలు పెడుతున్నారు.. అదీగాక అన్ని నియోజకవర్గాల్లోనూ, గ్రూపు రాజకీయాలు పెరిగి పోగా, కొత్తగా పార్టీలో చేరిన వారితో, మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారి మధ్య సంధి కుదరడం లేదట.. అందులో మంది ఎక్కువైతే మజ్జిగ పలుచగా అవుతుందన్నట్లు.. వలసలు ఎక్కువ అవడంతో పదవుల పంపకాల్లో కూడా మార్పులు రావడం ఖాయం అని ఆలోచించి ఒకే పార్టీలోని వారు రెండు వర్గాలుగా చీలిపోయారట.
అలాగే నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో నిత్యం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూ, సొంత పార్టీ నాయకులు ఒకరికొకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. దీంతో కొంత కాలంగా పార్టీ విషయాలపైన జగన్ కూడా అసంతృప్తి కి గురవుతున్నట్టుగా తెలుస్తోంది.. మరి ఇలాంటి పరిణామాల వల్ల పార్టీ ప్రతిష్టతో పాటుగా సీయం జగన్ పదవికే ముప్పు రావచ్చూ.. అందుకే వీలైనంత త్వరగా అంతర్గత విభేధాలను పరిష్కరించక పోతే పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆందోళనను కొందరు నాయకులు వ్యక్తం చేస్తున్నారట..