టీడీపీకి సంక‌టంగా మారిన మాజీ కేంద్ర మంత్రి నిర్ణయం.. ?

 

ఇంతకాలం ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి అంటే సరిగ్గా అర్ధం కానీ వారికి ఏపీ రాజకీయాలను ఉదాహరణగా చూపవచ్చూ.. ఎందుకంటే 2014 ఎన్నికల తర్వాత వైకాపా నేతలను, వైఎస్ జగన్ ను చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అసెంబ్లీలో ట్రీట్ చేసిన విధానం సామాన్యులను కూడా కదిలించిన సంగతి తెలిసిందే.. దీని ఫలితంగా 2019 ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ, వైకాపా ప్రవాహంలో గల్లంతైంది.. ఇకపోతే నాడు టీడీపీ నేతలు వైఎస్ జగన్ పై విషయం కంటే ఎక్కువగా వ్యక్తిగత దాడులకే ప్రాధాన్యం ఇచ్చారు, కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ గానీ ఆ పార్టీ నేతలు కానీ చంద్రబాబుపై వ్యక్తిగతంగా కాకుండా ఏపీలో జరిగిన అవినీతి విషయంలో తగిన ఆధారాలతో ఇరుకున పడవేసారు. ఇక అప్పటి నుండి టీడీపీ అధినేతకు కష్టాలు మొదలయ్యాయి..

ఒక వైపు అధికారం లేకపాయే, మరో వైపు అధికారపార్టీ తప్పులు వెతుకుతూ చెడుగుడు ఆడటం మొదలెట్టగా, టీడీపీలోని నాయకులంతా వైసీపీ బాట పట్టినారు.. ఇలా టీడీపీ పరువును కాపాడలేక, అధికార పార్టీకి దగ్గరవుతున్న వారిని బుజ్జగించలేక హైబీపీ రెంజ్ అవుతుండగా ఏం మాట్లాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని స్దితిలో చంద్రబాబు ఉన్నారనుకుంటున్నారట.. ఇలాంటి సమయంలో మరొక బిగ్ షాక్ న్యూస్ బాబుగారి చెవిన పడటానికి సిద్దంగా ఉందనే ప్రచారం జరుగుతుంది..

అదేమంటే టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసి, వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాద్‌ చేతిలో ఓటమిపాలైన మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్నారు. దీంతో ఈ ఉప ఎన్నికల్లో ఆమె అడుగులు ఎటువైపు అన్నది ఆసక్తికరంగా మారిన నేపధ్యంలో, ప్రచారం జరుగుతున్న వార్త ఏంటంటే ఆమె టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందట. కాగా గతంలో తనతో పాటు కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఇప్పుడు బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. దీంతో పురంధేశ్వరి సాయంతోనే ఆమె బీజేపీలోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే టీడీపీకి మరో ఝలక్‌ తప్పకపోవచ్చు అని అంటున్నారు విశ్లేషకులు..