ఐపీఎల్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఐపీఎల్ సమయంలో ఏపీ ప్రభుత్వం ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ 11 యాప్ ను బ్యాన్ చేసింది. ఇదో ఫాంటసీ గేమింగ్ ప్లాట్ పామ్.
ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీ గేమ్స్ ఉన్న యాప్స్ అన్నింటినీ ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ఆన్ లైన్ జూదం, బెట్టింగ్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఉపేక్షించేది లేదని జగన్ సర్కారు ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం తాజాగా డ్రీమ్ 11 యాప్ ను కూడా బ్యాన్ చేసింది.
ఏపీలో ఉన్నవాళ్లు డ్రీమ్ 11 యాప్ చేస్తే అది ఓపెన్ కావడం లేదు. ఏపీలో అది బ్యాన్ అయినట్టుగా మెసేజ్ చూపిస్తుంది.
డ్రీమ్ 11 యాప్ ఇప్పటికే తెలంగాణతో పాటుగా అసోం, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఏపీ కూడా చేరింది.
అయితే.. ఇప్పటికే డ్రీమ్ 11లో డబ్బులు పెట్టిన వాళ్ల సంగతి ఏంటంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించిన డ్రీమ్ 11 యాజమాన్యం.. ఎవరి డబ్బులు ఎక్కడికీ వెళ్లవని.. వివరాల కోసం ఒక లింక్ ను ప్రొవైడ్ చేసింది. ఆ లింక్ లోకి వెళ్లి కాంటాక్ట్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని ప్రకటించింది.
ఈ యాప్ ఏపీలో బ్యాన్ అయినట్టు ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తుతోంది. పనిలో పనిగా ఐపీఎల్ ను కూడా బ్యాన్ చేయండి.. పీడ పోతుంది.. అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.