AP: ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే . ఈయన హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై రాజమండ్రి బయలుదేరిన ఆయన.. అర్ధరాత్రి సమయంలో కొంతమూరు వద్ద ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.రోడ్డుపై నుంచి దిగువకు ప్రమాదవశాత్తు జారిపోయారని.. దీంతో బుల్లెట్ అతనిపై పడిపోవడంతో బలమైన గాయాలు కావడంతో మరణించి ఉంటారని పోలీసుల ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు..
ఇలా ప్రమాదవశాత్తు మరణించలేదని ఆయన ముఖంపై గాయాలు ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు తనని హత్య చేసి దానిని ఒక ప్రమాదంగా చిత్రీకరించారు అటు కుటుంబ సభ్యులు అలాగే ఇతర పాస్టర్లు కూడా ఈయన మృతి పై సందేహాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి పాస్టర్ ప్రవీణ్ మృతికి గల కారణాలను తెలియజేయాలని కోరారు.
ప్రస్తుతం ప్రవీణ్ మరణం ఏపీ రాజకీయాలలో కూడా తీవ్ర ప్రకంపనలను రేపుతోంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తూ పూర్తి విచారణ చేసే నిజా నిజాలు బయటపెట్టాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో విచారణ కూడా జరుగుతుంది. ఇదిలా ఉండగా ప్రవీణ్ పగడాల గతంలో జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేసినట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అలా అని మరో రాజకీయ పార్టీని పొగడ లేదు కానీ… జగన్ సర్కార్ తీసుకున్న పలు నిర్ణయాలతో మాత్రం విభేదించారు.
జగన్ ప్రభుత్వ హయాంలో ఆలయ పూజారులతోపాటు, ముస్లిం మత పెద్దలకు పాస్టర్లకు రూ.5,000 చొప్పున ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రజల సొమ్మును ఇలా మతపరమైన కార్యక్రమాలకు ఎలా కేటాయిస్తారని నాడు ప్రవీణ్ ప్రశ్నించారు కూడా! ఇది ఓటు బ్యాంక్ రాజకీయమంటూ పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు చేశారనే విషయాలు తెరపైకి రావడం గమనార్హం.