Hyper aadi: హైపర్ ఆది కూడా అలాంటోడే… అమ్మాయిలు కనిపిస్తే చాలు… సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్!

Hyper aadi: బుల్లితెర కమెడియన్ కమెడియన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో హైపర్ ఆదికి ఎంతో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా పని చేస్తూ అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా మారిపోయారు ఇలా ఈ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్న ఆది అనంతరం ఇతర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను నవ్వించారు అలాగే ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.

జబర్దస్త్ కార్యక్రమంలో ఆది కొనసాగే సమయంలో తన పంచ్ డైలాగుల ద్వారా అందరిని నవ్విస్తూ ఉండేవారు ఈయన యాంకర్లతో కలిసి స్కిట్లు చేసేవారు అలాగే జడ్జిలపై కూడా సెటైర్లు వేస్తూ అందరిని నవ్వించేవారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయ అలాగే సౌమ్యరావు వంటి వారితో కూడా స్కిట్లు చేయడంతో హైపర్ ఆదితో వారికి ఏదో రిలేషన్ ఉంది అంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి.

ఇలా వార్తలు వస్తున్న తరుణంలో జబర్దస్త్ మాజీ యాంకర్ సౌమ్యరావు స్పందించారు హైపర్ ఆది తనకు మధ్య ఏదో రిలేషన్ ఉంది అంటూ వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపారు. మేమిద్దరం ఒకే చోట పని చేయటం వల్లే అలాంటి వార్తలు బయటకు వచ్చాయని తెలిపారు. ఇక హైపర్ ఆది స్టేజ్ పై కొత్త అమ్మాయిలు కనిపిస్తే పులిహోర కలుపుతారనే అయితే ఇదంతా కూడా స్క్రిప్ ప్రకారమే జరుగుతుందని తెలిపారు.

ఇలా ఆన్ స్క్రీన్ అమ్మాయిలతో సరదాగా కనిపించే ఆది ఆఫ్ స్క్రీన్ లో మాత్రం చాలా మంచిగా గౌరవంగా ఉంటారని తెలిపారు. ఇక ఆది నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారని అతను చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటూ సౌమ్య రావు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.