బిగ్ బ్రేకింగ్ : ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా రాబోతోంది ??

2014 ఎన్నికల్లో అలాగే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ మరియు టీడీపీ నాయకుల గెలుపు కోసం, అధికారం కోసం ఉన్న ఏకైక లక్ష్యం ప్రత్యేక హోదా. ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రెండు పార్టీల నాయకుల విచ్చల విడిగా వాడుకున్నారు. అయితే ఎప్పటిలాగే గెలిచిన తరువాత ఈ విషయాన్ని చాలా చాకచక్యంగా మర్చిపోయారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన టీడీపీ చంద్రబాబు నాయుడు తరువాత స్పెషల్ ప్యాకేజికి ఒప్పుకొని, ఆ తరువాత మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తూ 2019 ఎన్నికల్లో నిలిచి ఘోర పరాజయాన్ని చూసింది.

ys jagan making a way to special status
ys jagan making a way to special status

అలాగే తాను కేంద్రం మెడలు వంచడం కాదు అవసరమైతే విరగ్గొట్టి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎన్డీయేలో చేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఏపీకి హోదా వచ్చేనా!

ఈమధ్య కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై చాలా చర్చలు జరుగుతున్నాయి . రాష్ట్ర ప్రయోజనాల కోసమని కొందరు చెప్తుంటే, లేదు సొంత ప్రయోజనాల కోసమని మరి కొందరు చెప్తున్నారు. అయితే జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే పనిలో పడ్డాడని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కేంద్రంలో బీజేపీకి ఎవ్వరి అవసరం లేదు. కానీ రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. వాటికోసమే బీజేపీ వైసీపీని ఎన్డీయే చేర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే ఇలా చేరడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి కొన్ని కండిషన్స్ పెట్టాడని తెలుస్తుంది. అవేంటంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ విషయాలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.

టీడీపీ ఏమంటుంది?

వైసీపీ ఎన్డీయే చేరతుందన్న విషయాన్ని వైసీపీ నేతలు గాని, బీజేపీ నేతలు గాని ఇప్పటి వరకు ఎక్కడా ప్రస్తావించలేదు. అలాగే ఎక్కడా కూడా ఖండించలేదు. అయితే ఈ విషయాలపై టీడీపీ నాయకులు మాత్రం చాలా స్పష్టంగా స్పందిస్తున్నారు. బీజేపీ వైసీపీని దగ్గరకు కూడా రానివ్వదని, వైసీపీ నాయకులు. వైసీపీ అనుకూల మీడియా కావాలనే ఈ తప్పుడు ప్రచారాన్ని మొదలు పెట్టారని చెప్తున్నారు. అలాగే వైసీపీ ఎప్పటికి ప్రత్యేక హోదా సాదించలేదని, అది కేవలం టీడీపీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే 2014లో గెలిచినప్పుడు ఎందుకు సాదించలేదని వైసీపీ నాయకులు టీడీపీని ప్రశ్నిస్తున్నారు.