ప్రతీ భారతీయుడు చైనా పై కసితో రగిలిపోతున్న తరుణమిది. సైనికులలో కలిసి పోరాడటానికి ప్రతీ పౌరుడు సిద్దంగా ఉన్నాడు. భరతమాత రుణం తీర్చుకునే సరైన అవకాశం ఇదేనంటూ చైనా పై ఎగబడుతున్నారు. చైనా తుపాకీ గుళ్లకు ఎదురెళ్లడానికి కావాల్సినంత గుండె నిబ్బరం మాకుందంటూ ప్రతీ పౌరుడు ముందుకొస్తున్నాడు. గాల్వానా లోయ ఘర్షణ తర్వాత భారత్ లో చోటు చేసుకున్న పరిస్థితులివి. ఇక చైనా నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తోన్న సంగతి తెలిసిందే. యుద్ధం వద్దంటూనే? కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇరు దేశాల ఉన్నత స్థాయి అధికారుల మధ్య చర్చలు సఫలమైనా! చైనా పొగరు మాత్రం తగ్గలేదు.
దీంతో భారత్ కూడా ఢీ అంటే ఢీఅనే అంటోంది. వెనక్కి తగ్గేది లేదని తాజాగా మరోసారి సంకేతాలు పంపింది. ఇక అగ్రరాజ్యం అమెరికా భారత్ యుద్దమంటూ చేస్తే…..భారత సైనికుల కోసం అమెరికా దళాల్నే రంగంలోకి దింపుతామని ప్రకటించింది. సోదర దేశ భారత్ కోసం తమ సైనికులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారని వెల్లడించింది. ఇంకా ఇజ్రయల్, జపాన్, రష్యా లాంటి బలమైన దేశాల సహకారం భారత్ కు అండగా ఉంది. చైనా ఏమాత్రం దూకుడు చూపించినా మిసైల్స్ తో విరుచుకుపడతామని సూచనప్రా యంగా సంకేతాలు పంపాయి. ఇక చైనాను ఎదుర్కోవడానికి భారత్ వద్ద కావాల్సినంత టెక్నాలజీ, యుద్ధ పరికరాలు సిద్దంగా ఉన్నాయి.
ఇప్పటికే యుద్ధానికి అసరమైన సరంజామా అంతా సరిహద్దులకు తరలించింది. ఈ నేపథ్యంలో భారత పైలెట్లకు అమెరికా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చింది. ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ 2021 కింద భారత్ పైలెట్లకు అమెరికాలోని గువామ్ స్థావరంలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బిల్లును గురువారం అమెరికా సెనెట్ ఆమోదానికి పెట్టారు. గువామ్ స్థావరంలో శిక్షణ పొందితే ఎలాంటి సైనికుడైనా ప్రత్యర్ధిని మట్టుబెట్టించగలడని అక్కడ సైనికులు చెబుతున్నారు. అత్యాధునిక పరిజ్ఞానం, అక్కడ శిక్షణ మిగతా దేశాలన్నింటికంటే చాలా ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు.