డ్రాగన్ దేశం చైనా పేరెత్తితోనే అగ్రరాజ్యం అమెరికా ఒంటికాలుపై లేచి పడుతుంది. కరోనా వైరస్ కి పురుడు పోసి ప్రపంచం మీదకి వదిలింది చైనా అని గట్టిగా చెప్పిన ఒకే ఒక్క దేశం అమెరికా. ప్రపంచ వేదికలపై చైనా కండకావరాన్ని కాస్తో కూస్తో కరిగించింది అమెరికానే. అగ్రరాజ్యమే ప్రపంచ దేశాలకు అండగ లేకపోతే చైనా దాష్టికాలకు అడ్డు అదుపు లేకుండా పోయేది. సరిహద్దు దేశాల్ని ఆక్రమించుకునే ప్రయత్నాలు యథేశ్చగా చేసేది. అమెరికా లాంటి దేశాల సపోర్ట్ చూసే భారత్ సహా చైనా పొరుగు దేశాలపై కాలు పెట్టాలంటే భయపడుతుంది! కేవలం కయ్యానికి కాలు దువ్వుతూ రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతుంది.
ప్రస్తుతం భారత్-చైనా దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ధ వాతావరణం గురించి తెలిసిందే. గాల్వానా ఘర్షణ తర్వాత ఇరు దేశాలు శాంతి ఒప్పందాన్ని ఉల్లఘించాయని ఆరోపించుకున్నాయి. భారత్ తో కయ్యానికి కాలు దువ్వింది డ్రాగన్ అని ప్రపంచదే శాలకు తెలుసు. ఇన్నాళ్లు భారత్ సహనాన్ని పరీక్షించిన చైనాతో యుద్ధమేనని భారత్ డిసైడ్ అయింది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు ముమ్మరం చేసింది. ఇరు దేశాల ఆర్మీ అధికారుల మధ్య చర్చలు సఫలం అయినా చైనా దూకుడు మాత్రం తగ్గించుకోలేదు. గాల్వానా కాకపోతే మరో బోర్డర్ అన్నట్లు అవకాశం ఉన్న ప్రతీచోట ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తోంది.
దీంతో భారత్ కూడా యుద్ధానికే సిద్దమైంది. చైనా సరిహద్దులకు భారీ ఎత్తున దళాలను తరలిస్తుంది. త్రివిద దళాలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లిపోయాయి. కాలు దువ్వితే దెబ్బ రుచి చూపించాల్సిందేనని డిఫెన్స్ కి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చేసింది. శాంతి లేదు..సంధి లేదు..కండకావరం చూపిస్తే తూటా దింపాల్సిందేనని ఆదేశాలిచ్చేసింది. ఈ విషయంలో భారత్ కు పూర్తి మద్దతను ప్రకటించింది అగ్ర రాజ్యం అమెరికా. అవసరమైతే సహకారం అడగండి. మా సైనికుల్ని పంపిస్తాం. కలిసి చైనా కోరలు వంచుదామంటూ! మద్దతిచ్చింది. డ్రాగన్ సైన్యాన్ని ఎదుర్కునేందుకు తాము సిద్దంగా ఉన్నామంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వెల్లడించారు.
యుద్దానికి తగ్గ అన్ని వనరులు సిద్దంగా ఉన్నాయన్నారు. జర్మనిలో అమెరికా బలగాలను 52వేల నుంచి 25 వేలకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వియత్నాం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలు కూడా తమ సహకారం కావాలంటే అడగండని తెలిపింది అమెరికా. ఏ ప్రాంతానికైనా చైనా నుంచి ముప్పు ఉందని తెలిస్తే అమెరికా సైన్యం అక్కడ క్షణాల్లో వాలిపోతుందని పాంపియో ఉద్ఘాటించారు.