Anjeer Health Benifits: సాధారణంగా డ్రై ఫ్రూట్స్ లో ఆరోగ్యానికి అవసరమైన అన్నిరకాల పోషకాలు ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా అంజీర పండ్లు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో డాక్టర్లు అంజీరను తినమని సలహా ఇస్తారు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగివున్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఉపయోగపడతాయి. అంజీర్ లు తీపి, వగరు, పులుపు కలయికతో ఉంటాయి. అంజీర లకు వేళ ఏళ్ల చరిత్ర ఉంది. వీటిని ఇప్పుడు ప్రపంచం అంతా పండిస్తున్నారు. అయితే ఎక్కువగా ఈజిప్టు, బ్రెజిల్, స్పెయిన్, ఇటలీ, మొరాకో, గ్రీస్ దేశాలు పండిస్తున్నాయి. వీటిని సీజన్ తో సంబంధం లేకుండా ఎండబెట్టి డ్రై ఫ్రూట్ రూపంలో సంవత్సరం మొత్తం మార్కెట్ లో అమ్ముతారు.
అంజీరలో పిండి, ఫైబర్, చెక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అంజీరపండ్లు తినడం వల్ల క్యాల్షియం, పొటాషియం, విటమిన్ సీ, విటమిన్ బి6, విటమిన్ కె, విటమిన్ ఎ లు పుష్కలంగా శరీరానికి లభిస్తాయి. ఇవే కాకుండా ఇతర ఖనిజాలు అయిన మెగ్నీషియం, సోడియం, ఫాస్పరస్ కూడా తగిన మోతాదులో ఉంటాయి. అంజీర్ లు తినటం వల్ల కలిగే లాభాలు ఒకసారి చూద్దాం
*గుండె, క్యాన్సర్ సమస్యలు రాకుండా అంజీరా లు పనిచేస్తాయి. గర్భిణీ స్త్రీలు అంజీర పండ్లు తినడం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది.
*ఇవి తినేటప్పుడు రుచికి తీపిగా ఉన్నా,మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
* మానసిక ఒత్తిడితో బాధ పడేవారు, అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి కూడా అంజీరా ఎంతగానో ఉపయోగపడతాయి.
*బ్లీడింగ్ సమస్యలు ఉన్నవారు అంజీర జ్యూస్ లో తేనె కలుపుకొని తరచు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.
* ఇందులో ఉన్న ఖనిజాలు జీర్ణక్రియను వేగవంతం చేయడంలో, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
*అంజీర పేస్ట్ ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం మీద మెలనిన్ తగ్గుతుంది.
* వాపులపై అంజిర పేస్ట్ నీ రాయటం వల్ల వాపు సమస్య నుండి తొందరగా ఉపశమనం కలుగుతుంది.
* అంజీరపండ్లలో ఏమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. డ్రై అంజీర తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. రెండు లేదా మూడు నానబెట్టి న అంజీరలను ఉదయాన్నే తింటే మంచి ఫలితాలు ఉంటాయి.